NTV Telugu Site icon

NDA Splits Over Jumma Break: జుమ్మా బ్రేక్పై ఎన్డీయేలో చీలికలు.. ప్రభుత్వంపై జేడీయూ ఫైర్..!

Neeraj Kumar

Neeraj Kumar

NDA Splits Over Jumma Break: అస్సాం ముఖ్యమంత్రి తీసుకున్న నిర్ణయం దేశ రాజ్యాంగానికి విరుద్ధంగా ఉంది. ప్రతి మత విశ్వాసానికి దాని సంప్రదాయాలను కాపాడుకునే హక్కులను కాలే రాసే విధంగా ఉంది. రాష్ట్ర అసెంబ్లీలో జుమ్మా ప్రార్థనల కోసం 2 గంటల వాయిదా పద్ధతిని రద్దు చేస్తూ అక్కడి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని జనతాదళ్-యునైటెడ్ (జేడీయూ) నాయకుడు నీరజ్ కుమార్ తీవ్రంగా విమర్శించారు. మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదని అన్నారు. పేదరికం నుంచి పైకి లేవడంపై అస్సాం సీఎం మరింత దృష్టి పెడితే బాగుంటుందని ఆయన అన్నారు. రంజాన్ సందర్భంగా శుక్రవారం సెలవులపై నిషేధం విధిస్తున్నారు.. కానీ హిందూ సంప్రదాయంలో మా కామాఖ్య దేవాలయం దగ్గర కొనసాగుతున్న బలి ఆచారంపై నిషేధం విధించగలరా? అని నీరజ్ కుమార్ ప్రశ్నించారు.

Read Also: Women’s Waist : పెళ్లి తర్వాత ఆడవాళ్ల నడుము ఎందుకు పెరుగుతుందో తెలుసా ?

కాగా, మత విశ్వాసాలపై దాడి చేసే హక్కు ఎవరికీ లేదు.. దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్న ప్రజలను పైకి తీసుకురావడంతో పాటు అస్సాం వరదలను ఎదుర్కోవాల్సిన అవసరం లేకుండా చూసుకోవడంపై మీరు మీ దృష్టిని కేంద్రీకరిస్తే బాగుండేది అని జేడీయూ నేత నీరజ్ కుమార్ అన్నారు. అస్సాంలో సాదులా యొక్క ముస్లిం లీగ్ ప్రభుత్వం ప్రవేశ పెట్టిన ప్రతి శుక్రవారం జుమ్మా ప్రార్థనల కోసం రెండు గంటల వాయిదా పద్ధతిని సీఎం హిమంత్ బిస్వాశర్మ నిలిపి వేయడం దారుణమన్నారు.

Read Also: Nani : సెప్టెంబరు 5న ముహూర్తానికి నేచురల్ స్టార్ రెడీ.. దర్శకుడు ఇతనే..

కాగా, ఈ నిర్ణయంపై సీఎం హిమంత బిస్వాశర్మ మాట్లాడుతూ.. హిందూ, ముస్లిం ఎమ్మెల్యేలు రూల్ కమిటీలో కూర్చుని రెండు గంటల విరామం సరికాదని ఏకగ్రీవంగా తీర్మానించారని చెప్పారు. 1937లో ప్రారంభమైన ఈ ఆచారం నిన్నటి నుంచి ఆగిపోయింది అన్నారు. గత నిబంధనల ప్రకారం ముస్లిం సభ్యులు నమాజ్‌కు వెళ్లేందుకు వీలుగా శుక్రవారం ఉదయం 11 గంటలకు సభ వాయిదా పడింది.. అయితే కొత్త నిబంధన ప్రకారం మతపరమైన ప్రయోజనాల కోసం ఎలాంటి వాయిదా లేకుండా సభ కార్యకలాపాలు అస్సాం సర్కార్ నిర్వహిస్తుంది. సవరించిన నియమం ప్రకారం, అస్సాం అసెంబ్లీ శుక్రవారాలతో సహా ప్రతిరోజూ ఉదయం 9.30 గంటల నుంచి సాయంత్రం వరకు కొనసాగుతుంది. మత ప్రాతిపదికన సమాజాన్ని విభజించే లక్ష్యంతో ఉన్న వలసవాద ఆచారాన్ని రద్దు చేసేందుకు ఈ సవరణ చేసినట్లు ఉత్తర్వుల్లో అస్సాం సర్కార్ పేర్కొంది.