Corona : ఇక నెగిటివ్ రిపోర్ట్ అవసరం లేదు.. కానీ..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ఒమిక్రాన్ వేరియంట్ వ్యాప్తి చెందుతుండడంతో దేశంలో థర్డ్ వేవ్ సృష్టించింది. దీంతో ఒమిక్రాన్ వ్యాప్తి అధికంగా ఉన్న రాష్ట్రాలతో పాటు పక్క రాష్ట్రాలు సైతం కోవిడ్ నిబంధనలను కఠినతరం చేశాయి. కోవిడ్ తీవ్రత ఉన్న రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులు కరోనా నెగిటివ్ రిపోర్ట్, వ్యాక్సిన్ సర్టిఫికెట్లను తప్పనిసరి చేస్తూ కోవిడ్ నిబంధనలు జారీ చేశాయి. అయితే ప్రస్తుతం కరోనా కేసులు దేశవ్యాప్తంగా తగ్గుముఖం పట్టాయి. ఈ నేపథ్యంలో కేరళ, గోవా నుండి వచ్చే ప్రయాణికుల తప్పనిసరి ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ ఉండాలన్న షరతును కర్ణాటక ప్రభుత్వం ఎత్తివేసింది. “అన్ని రకాల రవాణా మార్గాల ద్వారా కేరళ, గోవా నుండి కర్ణాటకకు వచ్చే ప్రయాణీకులకు ఇకపై ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ అవసరం లేదు” అని కర్ణాటక ఆరోగ్య మంత్రి డాక్టర్ కె సుధాకర్ ట్వీట్ చేశారు.
అయితే ఈ రాష్ట్రాల నుంచి వచ్చే ప్రయాణికులకు వ్యాక్సిన్ సర్టిఫికెట్ తప్పనిసరి అని మంత్రి తెలిపారు. డిసెంబర్ 2021 చివరి వారం నుండి ప్రారంభమైన కోవిడ్ -19 థర్డ్ వేవ్ తరువాత, ప్రభుత్వం నిబంధనలను విధించింది. కోవిడ్ -19 వ్యాక్సిన్ డబుల్ డోస్‌తో పాటు ఆర్టీపీసీఆర్ నెగిటివ్ రిపోర్ట్ తప్పనిసరిగా చేసింది. “ఫస్ట్, సెకండ్ వేవ్‌లతో పోలిస్తే తగ్గుతున్న కేసులు, తక్కువ ఆసుపత్రిలో చేరడం, తక్కువ మరణాల తరువాత, ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుంది” అని ఆరోగ్య శాఖ అధికారి ఒకరు తెలిపారు.
Also Read
- Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
- CJP Protest: ఆప్‌లో కీలక నేత, ఇప్పుడు కాక్రోచ్లకు పెద్ద దిక్కు.. ఎవరీ అజింక్యా షిండే.?
- Sudha Murty: చీర కట్టుకుంటే ‘బెహన్జీ’ అంటారు.. జీవిత అనుభవాలు పంచుకున్న సుధా మూర్తి
- Abhijeet Dipke: అభిజీత్ దిప్కే ఇంట్లో విషాదం.. అరెస్టైన కొద్దిసేపటికే ఘటన
తాజావార్తలు
-
Thalliki Vandanam: తల్లికి వందనం రెండో దశ నిధులు విడుదల.. రెండో దశలో లబ్ధిదారులు వీరే..
-
Vijay Deverakonda : నా సినిమాలకు టికెట్ ధరలు ఎప్పటికీ పెంచబోను.. విజయ్ దేవరకొండ కీలక నిర్ణయం!
-
Vijay Deverakonda: ‘రణబాలి’లో హింస ఎక్కువే.. కానీ ఆనాటి వాస్తవాలతో పోలిస్తే తక్కువే:
-
Jantar Mantar Protest: ఢిల్లీలో హైటెన్షన్.. అదుపులోకి మమతా, కేజ్రీవాల్, విజయన్.!
-
Vijay Deverakonda: “బ్రిటిషర్లు రైల్వేలు వేసింది మన కోసం కాదు.. దేశాన్ని దోచుకోవడానికే!”.. దేవరకొండ సంచలన వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Shai Hope: నా దగ్గర ఆ బ్యాట్స్ ఉన్నాయి.. అందుకే బంతి బౌండరీలు దాటుతోంది.. విండీస్ కెప్టెన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
3D ఎఫెక్ట్‌తో మెకానికల్ లుక్.. లిక్విడ్ కూలింగ్ సిస్టమ్‌తో భారత్‌లోకి Infinix GT 50 Pro..!
-
కొత్త అల్లాయ్ వీల్స్, అప్డేటెడ్ లుక్ తో Toyota Fortuner 2026 Leader ఎడిషన్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
IND vs WI: 249 పరుగులు చేసినా ఓటమి తప్పలేదు.. భారత్ కొంపముంచిన 5 కారణాలు ఇవే!
-
Hair Combs Cleaning: ₹1 ఖర్చుతో దువ్వెనలను ఇలా క్లీన్ చేయండి.. మీ జుట్టుకు చేరే మురికి, బ్యాక్టీరియా మాయం.!