Site icon NTV Telugu

Mask in Delhi: కొత్త రూల్స్‌… ఇక‌పై మాస్క్ అవ‌స‌రం లేదు…

దేశంలో క‌రోనా కేసులు దాదాపుగా కంట్రోల్‌లోకి వ‌చ్చింది. కేసులు త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో చాలా ప్రాంతాల్లో ఆంక్ష‌లు ఎత్తివేశారు. ప్ర‌స్తుతం ఆంక్ష‌లు పూర్తిస్థాయిలో ఎత్తివేస్తున్నారు. ఇప్ప‌టి వ‌ర‌కు కార్ల‌లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలోకూడా త‌ప్ప‌నిస‌రిగా మాస్క్ ధ‌రించాల‌నే రూల్ ఉండేది. ఇప్పుడు ఆ రూల్‌ను ప‌క్క‌న పెట్టేశారు. కార్ల‌లో ప్ర‌యాణం చేసే స‌మ‌యంలో మాస్క్ ధ‌రించాల్సిన అవ‌స‌రం లేద‌ని ఢిల్లీ స‌ర్కార్ స్ప‌ష్టం చేసింది. ఫిబ్ర‌వ‌రి 28 నుంచి ఈ ఆదేశాలు అమ‌ల్లోకి రానున్నాయి. అయితే, ప‌బ్లిక్ ప్లేస్‌లో మాస్క్ ధ‌రించ‌కుంటే విధించే జ‌రిమానాను రూ. 2000 నుంచి 500 కు త‌గ్గిస్తూ ఢిల్లీ స‌ర్కార్ నిర్ణ‌యం తీసుకున్న‌ది. ఢిల్లీలో కేసులు పూర్తిస్థాయిలో త‌గ్గుముఖం ప‌ట్ట‌డంతో ప్రభుత్వం ఈ మేర‌కు నిర్ణ‌యం తీసుకున్న‌ది.

Read: Russia Z Symbol: ర‌ష్య యుద్ధ ట్యాంకుల‌పై జెడ్ గుర్తు ఎందుకు ఉంటుందో తెలుసా?

Exit mobile version