NTV Telugu Site icon

No Fish, No Wedding: చేపలు, మాంసాహారం పెట్టలేదని పెళ్లిలో వధువు కుటుంబంపై దాడి..

No Fish, No Wedding

No Fish, No Wedding

No Fish, No Wedding: ఉత్తర్ ప్రదేశ్‌లో మరో పెళ్లి పెటాకులైంది. పెళ్లిలో పనీర్, పులావ్, ఇతర వెజిటేరియన్ ఐటమ్స్ బాగానే పెట్టినప్పటికీ, తమకు చేపలు, మాసం లేదని పెళ్లికొడుకు బంధువులు పెద్ద గొడవనే స‌ృష్టించారు. చివరకు కట్నం కూడా బాగా ముట్టచెప్పినప్పటికీ వరుడి కుటుంబీకులు, వధువు కుటుంబ సభ్యులపై దాడికి తెగబడ్డారు. వరుడు వివాహ వేదికపై నుంచి వెళ్లిపోయాడు, దీంతో వివాహం రద్దైంది. దీనిపై వధువు కుటుంబ సభ్యులు పోలీసులకు దాడి, వరకట్నంపై ఫిర్యాదు చేశారు.

Read Also: Wedding: కూలర్ వివాదం.. పెళ్లికి నిరాకరించిన వధువు.. వరుడి బాధ వైరల్..

గురువారం ఉత్తర్ ప్రదేశ్ లోని డియోరియా జిల్లాలోని ఆనంద్ నగర్ గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. అభిషేక్ శర్మ అనే వ్యక్తికి సుష్మ అనే అమ్మాయిలో వివాహం కుదిరింది. పెళ్లి చేసుకునేందుకు భారీ ఉరేగింపుతో వరుడు గ్రామానికి చేరుకున్నాడు. పెళ్లికి అంతా సిద్ధమైంది. ఈ సమయంలో మాంసాహారం లేదని వరుడు, అతని తండ్రి సురేంద్ర శర్మ మరికొందరు వధువు సుష్మ తండ్రి దినేష్ శర్మని తిట్టడం ప్రారంభించారు. ఇదిలా ఉండగానే వరుడితో పాటు అతని బంధువులు వధువు బంధువులపై కర్రలతో దాడి చేశారని పోలీసులకు వధువు బంధువులు ఫిర్యాదు చేశారు. ఈ పెళ్లి కోసం దాదాపుగా రూ. 5 లక్షల కట్నం ఇచ్చినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. వరుడు అభిషేక్ శర్మకు కట్నంగా కారు కోసం రూ. 4.5 లక్షలు, రెండు బంగారు ఉంగరాలు ఇచ్చానని దినేశ్ శర్మ తన ఫిర్యాదులో పేర్కొన్నారు.