Site icon NTV Telugu

Jairam Ramesh: అమిత్ షా కలెక్టర్లను బెదిరిస్తున్నారు.. స్పందించిన ఈసీ..

Jairam Ramesh

Jairam Ramesh

Jairam Ramesh: మంగళవారం జరిగే ఓట్ల లెక్కింపు ముందు కాంగ్రెస్ నేత జైరాం రమేష్ సంచలన ఆరోపణలు చేశారు. అమిత్ షా అన్ని జిల్లాల అధికారులను పిలిచి బెదిరించారని ఆరోపించారు. ఈ ఆరోపణలు చేసిన ఒక రోజు తర్వాత కేంద్రం ఎన్నికల సంఘం స్పందించింది. ఏ అధికారి కూడా ‘‘అనవసరమైన ప్రభావం’’ గురించి నివేదించలేదని, ఏవైనా వివరాలు ఉంటే ఆదివారం సాయంత్రం 7 గంటల వరకు ఇవ్వాలని, వీటిని బట్టి చర్యలు తీసుకుంటామని కేంద్ర ఎన్నికల సంఘం చెప్పింది.

Read Also: Assembly election 2024: అరుణాచల్ అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీ భారీ విజయం.. సిక్కింలో ఎస్కేఎం..

‘‘ అధికారం కోల్పోతున్న హోంమంత్రి కలెక్టర్లను పిలుస్తున్నారు. ఇప్పటి వరకు అమిత్ షా 150 మందితో మాట్లాడారు. అధికారులను బహిరంగంగా బెదిరించే ప్రయత్నం చాలా సిగ్గుచేటు మరియు ఆమోదయోగ్యం కాదు. ప్రజాస్వామ్యం ఆదేశానుసారం పని చేస్తుందని గుర్తుంచుకోండి, బెదిరింపులపై కాదు. జూన్ 4న ప్రధాని మోడీ, అమిత్ షా ఇద్దరు నిష్క్రమిస్తారు. ఇండియా కూటమి విజయం సాధిస్తుంది. అధికారులు ఎలాంటి ఒత్తిడికి లోనుకాకూడదు. వారు రాజ్యాంగాన్ని కాపాడుకోవాలి’’ అని ఎక్స్ వేదికగా జైరాం రమేష్ ట్వీట్ చేశారు.

మీరు జాతీయ పార్టీలో సీనియర్ నేత కాబట్టి కౌంటింగ్ రోజుకు ముందు మీరు నిజమని నమ్ముతున్న సమాచారాన్ని, ఆధారాలను ఇవ్వాలని, 150 మంది కలెక్టర్ల అందించాలని ఈసీ కోరింది. తద్వారా తగిన చర్యలు తీసుకోవచ్చని ఎన్నికల సంఘం చెప్పింది. అయితే, ఇలాంటి ఆరోపణలను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి కొట్టిపారేశారు. భారత హోం మంత్రి ఏ జిల్లా అధికారిని లేదా సబ్ డివిజనల్ అధికారిని పిలువరు, ఒక రాష్ట్ర సీఎంతో వ్యవహరిస్తారు అని అన్నారు.

Exit mobile version