CM Seat-Sharing: కర్ణాటక ముఖ్యమంత్రిగా ఐదేళ్ల పాటు తననే కొనసాగిస్తున్నారనే విషయాన్ని సిద్ధరామయ్య మరోసారి స్పష్టం చేశారు. డిప్యూటీ సీఎం డీకే శివకుమార్ నుంచి పెరుగుతున్న ఒత్తిళ్లతో 2023లో ఇద్దరూ రెండున్నరేళ్లు చొప్పున సీఎం పదవిని షేర్ చేసుకుంటామన్న ఒప్పందం ఉందన్న వాదనలను ఆయన అసెంబ్లీలో ఖండించారు. నేను ఒకసారి ఐదేళ్ల పూర్తి కాలం సీఎంగా పని చేశాను.. ఇప్పుడు మళ్లీ ముఖ్యమంత్రిని అయ్యాను.. నా దృష్టిలో హైకమాండ్ నా వెంటే ఉంది.. రెండున్నరేళ్లకు సీఎం కుర్చీని పంచుకోవాలన్న ఎలాంటి ఒప్పందం చేసుకోలేదని సిద్ధరామయ్య స్పష్టంగా చెప్పారు.
Read Also: Wild Cows: అడవి ఆవుల సమస్య పరిష్కరించండి.. సీఎం, డిప్యూటీ సీఎం దృష్టికి తీసుకెళ్లిన కలెక్టర్..
అయితే, సీఎం సిద్ధరామయ్య వ్యాఖ్యలకు ముందు మంత్రి సతీశ్ జార్కిహోళి ఇంట్లో జరిగిన విందుకు సిద్ధరామయ్యతో పాటు ఆయన సన్నిహిత నేతలు హాజరయ్యారు. ఈ మీటింగ్ కు డీకే శివకుమార్‌కు ఆ ఆహ్వానం అందకపోవడం రాజకీయంగా చర్చనీయాంశమైంది. కాగా, ఈ సమావేశాన్ని డీకే తేలికగా తీసుకుంటూ “డిన్నర్‌కు కలవడంలో తప్పేముంది?” అని వ్యాఖ్యానించారు. ఇక, శివకుమార్ వర్గం 2023 ఎన్నికల తర్వాత జరిగిన ఒప్పందాన్ని ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో నాయకత్వ మార్పు జరగాలని డిమాండ్ చేస్తు్న్నారు. అప్పట్లో అహిందా వర్గాల మద్దతు సిద్ధరామయ్యకు సపోర్టు ఇవ్వగా, వొక్కలిగ వర్గం శివకుమార్‌కు మద్దతు ఇచ్చింది. చివరకు సిద్ధరామయ్యకే ముఖ్యమంత్రి పీఠం దక్కింది.
Read Also: Shocking Murder: రెంటర్స్ ని అద్దె అడిగేందుకు వెళ్లిన ఇంటి ఓనర్.. ఆ తర్వాత ఏమైందంటే..
ఇక, ఇటీవల డీకే శివకుమార్‌కు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఢిల్లీకి వెళ్లి పార్టీ హైకమాండ్ ను కలిసినా, అధిష్టానం మాత్రం మళ్లీ సిద్ధరామయ్యకే మద్దతిచ్చింది. అయితే, ‘పవర్ బ్రేక్‌ఫాస్ట్’ల తర్వాత సీఎం కుర్చీ మార్పుపై చర్చలు జరిగినట్టు సమాచారం. డీకే వర్గం 2026 ఏప్రిల్‌లోపు ముఖ్యమంత్రిని మార్చాలని కోరుతుండగా, సిద్ధరామయ్య వర్గం పూర్తి పదవీకాలం కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నట్లు పార్టీలో ప్రచారం జరుగుతుంది. సిద్ధరామయ్య తన పదవీకాలం పూర్తయ్యాక 2028 అసెంబ్లీ ఎన్నికల్లో శివకుమార్‌కు మద్దతు ఇవ్వాలన్న ప్రతిపాదనను ముందు పెట్టినట్లు తెలుస్తుంది. అది వర్కౌట్ అయితే, వొక్కలిగ- అహిందా వర్గాల ఓటు బ్యాంకులను ఏకతాటిపైకి తీసుకొచ్చి, 2028లో బీజేపీకి గట్టి పోటీ ఇవ్వొచ్చనే భావనలో కాంగ్రెస్ ఉంది.
