Site icon NTV Telugu

వండర్: ఒక్క కరోనా కేసు కూడా నమోదు కానీ గ్రామం ఇదే…!!

కరోనా మహమ్మారి దేశం నలుమూలలా వ్యాపిస్తోంది.  నగరాలు, పట్టణాల నుంచి గ్రామాల్లో కూడా కరోనా వ్యాపించింది. ప్రస్తుతం గ్రామాలకు మహమ్మారి భయం పట్టుకున్నది.  వివిధ నగరాలకు వలస వెళ్లిన కార్మికులు తిరిగి గ్రామాలకు వస్తుండటంతో గ్రామాల్లో కేసులు పెరుగుతున్నాయి.  ఇక మధ్యప్రదేశ్ లో కేసులు పెద్ద సంఖ్యలో నమోదవుతున్నాయి.  అయితే, మధ్యప్రదేశ్ లోని అగర్-మాల్వా గ్రామంలో ఈనాటి వరకు ఒక్కకేసు కూడా నమోదు కాలేదు.  2020లో కరోనా మహమ్మారి వ్యాపిస్తుందన్న సమయంలో ఆ గ్రామంలోని ప్రజలు అప్రమత్తటం అప్రమత్తం అయ్యారు.  ఇళ్లను ఎప్పటికప్పుడు శానిటైజ్ చేసుకుంటూ, గ్రామాన్ని పరిశుభ్రంగా ఉంచుతుకుంటున్నారు.  మాస్క్, భౌతిక దూరం వంటి వాటిని పాటిస్తున్నారు.  ఏ ఇంటి నుంచి ఎవరు బయటకు వెళ్లినా తప్పనిసరిగా చేతులు, ముఖం శుభ్రం చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు.  అదే విధంగా గ్రామంలోని యువకులు ఒక టీమ్ గా ఏర్పడి గ్రామంలోకి ఎవరు కొత్త వ్యక్తులు వచ్చినా వారి ఆరోగ్యపరిస్థితిని తెలుసుకున్నాకే గ్రామంలోకి రానిస్తున్నారు. జాగ్రత్తలు తీసుకోవడంతో ఆ గ్రామంలో ఇప్పటి వరకు ఒక్క కేసు కూడా నమోదు కాలేదు.  

Exit mobile version