Bihar Assembly Floor Test: నితీష్ కుమార్ నేతృత్వంలోని ప్రభుత్వం అసెంబ్లీలో ప్రతిపక్ష బీజేపీ వాకౌట్ చేయడంతో మూజువాణి ఓటు ద్వారా విశ్వాస తీర్మానాన్ని ఏకగ్రీవంగా నెగ్గింది. విశ్వాస తీర్మానంపై చర్చ సందర్భంగా నితీష్ కుమార్ మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ పథకాలకు కేంద్ర ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. హర్ ఘర్ జల్ రాష్ట్ర ప్రభుత్వ పథకమని ఆయన ఆరోపించారు. “గ్రామీణ ప్రాంతాల్లో రోడ్ల పథకం అటల్ బిహారీ వాజ్‌పేయి ప్రభుత్వ హయాంలో ప్రారంభించబడింది. మీరు పిల్లలు, దయచేసి నేర్చుకోండి. కేంద్రంలోని ఈ ప్రభుత్వానికి ఈ ఘనత దక్కదు’’ అని అన్నారు. బీజేపీలో మంచి వాళ్లకు చోటు లేదని వ్యాఖ్యనించారు. 2015లో బీజేపీని తానే గెలిపించానని అన్నారు. 2024లో తానేంటో నిరూపిస్తానన్నారు. వాజ్‌పేయి, అద్వానీలే తన మాట వినేవారని, ఇప్పుడు అలాంటి పరిస్థితులు బీజేపీలో లేవన్నారు. అయితే సీఎం నితీష్ వ్యాఖ్యలపై బీజేపీ నిరసన వ్యక్తం చేసింది. అసెంబ్లీ నుంచి బీజేపీ ఎమ్మెల్యేలు వాకౌట్ చేశారు.
AAP: బీజేపీలో చేరితే రూ.20 కోట్లు.. చేర్పిస్తే రూ.25కోట్లు.. లేదంటే సీబీఐ దాడులు..!
అంతకుముందు అసెంబ్లీలో డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ మాట్లాడుతూ.. బీజేపీకి ముగ్గురు అల్లుళ్లు ఉన్నారని-ఈడీ, సీబీఐ, ఐటీ ఉన్నాయన్నారు. తలవంచలేని, కొనుగోలు చేయలేని వారిపై బీజేపీ ఈ ఏజెన్సీలను ప్రయోగిస్తుందని ఆయన ఆరోపించారు. తమ భాగస్వామ్యం (నితీష్‌తో) అద్భుతాలు చేస్తుందని ఆయన అన్నారు. “ఇది సుదీర్ఘ ఇన్నింగ్స్ అవుతుంది.” అని ఆయన అన్నారు. రాష్ట్రంలో జేడీ(యూ) సొంతంగా ఏ ఎన్నికల్లోనూ గెలవలేదని బీజేపీ నేత తార్కిశోర్ ప్రసాద్ అన్నారు. నితీష్ తన ఉపముఖ్యమంత్రిని మాత్రమే మార్చి సీఎంగా కొనసాగాలనుకుంటున్నారని ఆయన విమర్శించారు.
