Site icon NTV Telugu

Fodder Scam: నేను నిరాకరించా.. ఆయన మనుషులే లాలూపై కేసు పెట్టారు..!

మాజీ ముఖ్యమంత్రి, ఆర్జేడీ అధినేత లాలూ ప్రసాద్ యాదవ్‌కు రాంచీలోని సీబీఐ కోర్టు జైలు శిక్ష విధించిన విషయం తెలిసిందే.. దాణా స్కామ్‌కు సంబంధించిన ఐదో కేసులో లాలూని దోషిగా తేల్చిన కోర్టు… ఐదేళ్ల జైలు శిక్ష విధించింది.. జైలు శిక్షతో పాటు రూ.60 లక్షల జరిమానా కూడా విధించింది.. అయితే, లాలూ ప్రసాద్‌ యాదవ్‌పై కేసుల విషయంలో ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు బీహార్‌ సీఎం నితీష్‌ కుమార్‌… ఆయనపై కేసులు పెట్టింది మేం కాదన్న ఆయన.. ఆయనతో సన్నిహితంగా ఉన్నవారే పెట్టారని విమర్శించారు.. ప్రస్తుతం లాలూ ప్రసాద్‌ యాదవ్‌తో ఉన్నవారే ఆయనపై కేసులు పెట్టారన్నారు నితీష్‌ కుమార్.. ఇక, లాలూపై కేసులు పెట్టినవారు తన వద్దకు కూడా వచ్చారని.. కానీ, మేం నో చెప్పామన్నారు. కేసులు పెట్టాలనుకుంటే మీరు ఆ పని చేసుకోవచ్చు.. తన పని మాత్రం అది కాదని వారితో చెప్పినట్టు ఈ సందర్భంగా గుర్తుచేసుకున్నారు నితీష్‌ కుమార్‌.

Read Also: Payyavula Keshav: సీఎం జగన్‌కు పయ్యావుల లేఖ

కాగా, 1990లలో దాణా కుంభకోణం జరిగింది.. డోరండ ట్రెజరీ నుంచి రూ. 139.5 కోట్ల రూపాయలను చట్ట విరుద్ధంగా విత్ డ్రా చేశారనే ఆరోపణలతో ఈ కేసులు నమోదు చేశారు.. ఆ సమయంలో బీహార్ సీఎంగా లాలూ ప్రసాద్ ఉన్నారు. ప్రస్తుతం లాలూ ప్రసాద్ బెయిల్ పై బయట ఉన్న విషయం తెలిసిందే కాగా.. అనారోగ్య కారణాలతో ఆయన బాధపడుతున్నారు.. దీంతో, ఆయనకు కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కోర్టు విచారణకు ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా హాజరయ్యారు లాలూ… దాణా కుంభకోణానికి సంబంధించి మరో కేసు పాట్నాలోని సీబీఐ కోర్టులో పెండింగ్‌లో ఉంది.

Exit mobile version