NTV Telugu Site icon

INDIA bloc: ఇండియా కూటమి కన్వీనర్‌గా నితీష్ కుమార్..!

Nistish Kumar

Nistish Kumar

INDIA bloc: లోక్‌సభ ఎన్నిలకు దగ్గర పడుతున్న నేపథ్యంలో ప్రతిపక్ష ఇండియా కూటమి జోరు పెంచుతోంది. మరోవైపు సీట్ల పంపకాలపై ఇండియా కూటమి నేతలు చర్చలు జరుపుతున్న సమయంలో కీలక విషయం వెలుగులోకి వచ్చింది. కూటమికి కన్వీనర్‌గా బీహార్ సీఎం, జేడీయూ చీఫ్ నితీష్ కుమార్‌ని నియమొచే అవకాశం ఉందని సంబంధిత వర్గాలు తెలిపాయి. ఈ నిర్ణయాన్ని ఆమోదించడానికి ప్రతిపక్ష పార్టీలు ఈ వారంలో వర్చువల్‌గా సమావేశం కానున్నట్లు తెలుస్తోంది. ఈ ప్రతిపాదికపై నితీష్ కుమార్, లాలూ ప్రసాద్ యాదవ్‌లతో మంగళవారం కాంగ్రెస్ చర్చించింది.

Read Also: Argentina President Kissing Video: స్టేజ్ పై రొమాన్స్ తో రెచ్చిపోయిన అర్జెంటీనా అధ్యక్షుడు.. యూ నాటీ

కూటమిలో ఇతర భాగస్వామ్య పార్టీలతో చర్చించి, వారి అభిప్రాయాలను పరిగణలోకి తీసుకున్నట్లు తెలుస్తోంది. ఇదే విషయమై నిన్న నితీష్ కుమార్ శివసేన(యూబీటీ) నేత ఉద్ధవ్ ఠాక్రేతో మాట్లాడారు. నితీష్ కుమార్‌ని ఈ పదవికి ఎంచుకునే ఆలోచనను ఆప్ చీఫ్ అరవింద్ కేజ్రీవాల్ కూడా మద్దతు తెలిపినట్టు తెలుస్తోంది.

2024 సార్వత్రిక ఎన్నికల్లో బీజేపీ, ప్రధాని నరేంద్రమోడీని అడ్డుకునేందుకు దేశంలోని ఎన్డీయేతర విపక్షాలన్నీ కలిసి ఇండియా కూటమి పేరుతో జతకట్టాయి. కాంగ్రెస్, ఆర్జేడీ, జేడీయూ, ఆప్, తృణమూల్ కాంగ్రెస్, డీఎంకే వంటి ప్రధాన పార్టీలతో పాటు చిన్నాచితక పార్టీలు ఈ కూటమిలో ఉన్నాయి. ఈ కూటమి మొదటి సమావేశాన్ని సీఎం నితీష్ కుమార్ పాట్నాలో నిర్వహించారు. ఆ తర్వాత బెంగళూర్, ముంబై, ఢిల్లీ వేదికలుగా ఇండియా కూటమి సమావేశాలు జరిగాయి. చివరి సమావేశం ఢిల్లీలో డిసెంబర్ 19న జరిగింది. ఈ సమావేశంలో ప్రధాని అభ్యర్థిగా మల్లికార్జున ఖర్గేని, బెంగాల్ సీఎం మమతా బెనర్జీ ప్రతిపాదించారు.