Nitish Kumar hints at power transfer to Tejashwi Yadav in future: బీజేపీ పొత్తును కాదని.. జేడీయూ అధినేత, బీహాార్ సీఎం నితీష్ కుమార్, మరోసారి లాలూ ప్రసాద్ యాదవ్ ఆర్జేడీ పార్టీతో జతకట్టారు. బీజేపీతో పొత్తు తెగదెంపులు చేసుకుని, ఆర్జేడీతో కలిసి మహాఘటబంధన్ కూటమిని ఏర్పాటు చేశారు. ఇదిలా ఉంటే సీఎం నితీష్ కుమార్ కీలక వ్యాఖ్యలు చేశారు. వచ్చే ఎన్నికల్లో ఆర్జేడీ నేత, డిప్యూటీ సీఎం తేజస్వీ యాదవ్ కు అధికార బదలాయింపుపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.
భవిష్యత్తులో ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ కు తన అధికారాన్ని బదలాయించనున్నట్లు నితీష్ కుమార్ సూచనప్రాయంగా తెలియజేశారు. మహాఘటబంధన్ ఎమ్మెల్యే సమావేశంలో నితీష్ కుమార్ తెలిపినట్లు సమాచారం. భవిష్యత్తులో మహాఘటబంధన్ కు తేజస్వీ యాదవ్ నేతృత్వం వహిస్తారని అన్నారు.
Read Also: Ram Gopal Varma: మియా మాల్కోవాతో సెక్స్.. ఆమెలో అవే ఇష్టం
కేంద్రంపై, బీజేపీ ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు. బీజేపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నంత వరకు నలంద యూనివర్సిటీ పునరుద్ధరణపై తనకు ఆశ లేదని నితీష్ కుమార్ పేర్కొన్నారు. నలందలో అభివృద్ధి గురించి ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. తేజస్వీ దీనిని ముందుకు తీసుకెళ్తారని అన్నారు. నలంద కోసం మేము చాలా చేశామని.. మా మధ్య విభేదాలు సృష్టించడానికి చాలా మంది ప్రయత్నిస్తారు.. కానీ మనమంతా ఐక్యంగా ఉండాలని నితీష్ కుమార్ అన్నారు. ఇదిలా ఉంటే నితీష్ కుమార్ వ్యాఖ్యలపై తేజస్వీ స్పందించారు. ప్రస్తుతం మేమంత సీఎం నితీష్ కుమార్ నేతృత్వంలో ఐక్యంగా పనిచేస్తున్నామని.. 2024 ఎన్నికలపై గురించి ఆలోచిస్తున్నామని అన్నారు.