NITI Aayog: 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా.. 30 ట్రిలియన్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఆర్థిక ప్రణాళికలను ప్లాన్ చేస్తోంది. ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్ నగరాల ఆర్థిక పరివర్తణ కోసం ఒక ప్రణాళికలను సిద్ధం చేసినట్లు, ఇది అభివృద్ధి చెందిన ఆర్థిక వ్యవస్థగా మారేందుకు సాయపడుతుందని నీతిఆయోగ్ సీఈఓ బీవీఆర్ సుబ్రమణ్యం శనివారం తెలిపారు. నగరాలు ఆర్థిక కార్యకలాపాలకు కేంద్రంగా ఉన్నందున, మరో 20-25 నగరాల ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేయాలని నీతి ఆయోగ్ యోచిస్తోందని ఆయన చెప్పారు.
Read Also: PM Modi: ట్రిపుల్ తలాక్, మహిళా బిల్లు, ఆర్టికల్ 370.. 17వ లోక్‌సభ గొప్ప సంస్కరణలు..
2047 నాటికి భారత్ 30 బిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా మారేందుకు నీతి ఆయోగ్ ఒక విజన్ డాక్యుమెంట్‌ని సిద్ధం చేస్తోంది. దీనిని ప్రధాని నరేంద్రమోడీ విడుదల చేశారు. ‘‘ మేము నగరాల అర్బన్ ప్రణాళికను మాత్రమే సిద్ధం చేశాము. నీతి ఆయోగ్ ముంబై, సూరత్, వారణాసి, వైజాగ్‌ల ఆర్థిక పరివర్తన కోసం ఆర్థిక ప్రణాళికను సిద్ధం చేసింది’’ అని ఢిల్లీలో జరిగిన సమావేశంలో సుబ్రమణ్యం చెప్పారు.
గతేడాది మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్‌నాథ్ షిండే నీతి ఆయోగ్ అధికారులతో సమావేశమై.. ముంబై మెట్రోపాలిటన్ రీజియన్(ఎంఎంఆర్) జీడీపీని 2030 నాటికి 300 బిలియన్ డాలర్లకు తీసుకువెళ్లడానికి అవసరమైన చర్చల గురించి చర్చించారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా తీర్చిదిద్దేందుకు డిసెంబర్ 11న కేంద్రం దేశ యువత అభిప్రాయాలను కోరిందని సుబ్రమణ్యం తెలిపారు. ఇప్పటి వరకు భారతదేశ యువత నుంచి 10 లక్షలకు పైగా వివరణాత్మక సూచనల్ని స్వీకరించామని, వీటిని కృత్రిమ మేధస్సు (AI) ఉపయోగించి ప్రాసెస్ చేస్తున్నామని తెలిపారు.
