Swatantra Bhardwaj: కాక్రోచ్ పార్టీ మద్దతుదారుడిపై దాడి.. స్వతంత్ర భరద్వాజ్ అరెస్ట్..
- సీజేపీ మద్దతుదారు అషూ ఆజాద్ తండ్రిపై దాడి..
- స్వతంత్ర భరద్వాజ్‌ను యూపీలో అరెస్ట్ చేసిన ఢిల్లీ పోలీసులు..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Swatantra Bhardwaj: ఢిల్లీలోని జంతర్ మంతర్ నిరసనల్లో కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ) మద్దతుదారు నిషూ అజాద్ తండ్రి సంజయ్ కుమార్‌పై దాడి చేశాడనే ఆరోపణల కారణంగా యాక్టివిస్ట్ స్వతంత్ర భరద్వాజ్‌ను ఢిల్లీ పోలీసులు అరెస్ట్ చేశారు. ఉత్తర్ ప్రదేశ్ బులంద్‌షహర్‌లో అతడిని అదుపులోకి తీసుకున్నారు. నిషూ ఆజాద్ తండ్రిపై దాడి చేసినట్లు ఒక పాడ్‌కాస్ట్‌లో అంగీకరించిన వీడియో వైరల్ కావడంతో ఈ అరెస్ట్ జరిగింది.
2026 జూన్ 23న జంతర్ మంతర్ వద్ద జరిగిన సీజేపీ నిరసన ప్రదర్శన సందర్భంగా ఈ సంఘటన జరిగింది. ఫిర్యాదుదారుడైన సంజయ్ కుమార్, తన కుమార్తె నిషూతో కలిసి నిరసనల్లో పాల్గొనడానికి వచ్చిన సమయంలో స్వతంత్ర భరద్వాజ్‌తో గొడవ జరిగినట్లు తెలుస్తోంది. ఇద్దరు ముగ్గురు వ్యక్తులు సంజయ్‌ను చట్టుముట్టి కొట్టారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు, తన ఆత్మరక్షణలో భాగంగా సీజేపీ కార్యకర్తల నుంచి తప్పించుకోవడానికి దాడి చేసినట్లు స్వతంత్ర చెబుతున్నారు.
Also Read
- Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
- Student Protests: రేప్ నుంచి దెయ్యం వరకు.. పుకార్లతో రగిలిపోతున్న యూనివర్సిటీలు.!
- Kaveri Engine: రష్యాలో ‘‘కావేరి ఇంజన్’’ సత్తా.. భారత స్వేదేశీ ఇంజన్ సిద్ధం.!
- Congress: ప్రధాని మోదీ, జ్ఞానేష్ కుమార్ రాజీనామా చేయాలి.. సీడబ్ల్యూసీలో కాంగ్రెస్ 5 డిమాండ్లు..
స్వతంత్ర భరద్వాజ్ వీడియో వైరల్ కావడంతో అతడిని అరెస్ట్ చేయాలని శుక్రవారం కాక్రోచ్ జనతా పార్టీ కో కన్వీనర్లు అశుతోష్ రాంకా, సౌరవ్ దాస్, ఇతర కార్యకర్తలు పార్లమెంట్ స్ట్రీట్ పోలీస్ స్టేషన్ ముందు నిరసన తెలిపారు. దీంతో ఢిల్లీ పోలీసులు ఐపీసీలోని సెక్షన్లు 115(2), 126(2), మరియు 3(5) కింద ఎఫ్ఐఆర్ నంబర్ 62/2026 కేసు నమోదు చేశారు. ఈ కేసులో స్వతంత్ర భరద్వాజ్‌తో పాటు సూరజ్ కుమార్‌ను నిందితులుగా చేర్చారు. మరోవైపు, ఈ ఘటన రాజకీయ రంగు పులుముకుంది. నిషూ ఆజాద్‌కు మద్దతు ఇస్తున్నట్లు కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ ప్రకటించారు. నిందితులను తక్షణమే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు.
తాజావార్తలు
-
CDSCO: పదేపదే ట్యాబ్లెట్లు వాడుతున్నారా?
-
HMD Vibe2 Pro: 64ఎంపీ సోనీ కెమెరా, 6000mAh బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. HMD కొత్త 5G ఫోన్.. అక్టోబర్ 8న లాంచ్..
-
Ketan Agarwal Case: కేతన్ హత్య 5 వేల పేజీల ఛార్జిషీట్.. పిచ్చిగా ప్రేమించిన కేతన్, హత్య చేసిన సియా..
-
Explainer: మరిన్ని విపత్తులు తప్పవా?
-
Lava Smart Phone: 6000mAH బ్యాటరీ, 120Hz రిఫ్రెష్ రేట్.. లావా నుంచి బడ్జెట్ ధరలో స్మార్ట్ ఫోన్ లాంచ్..
ట్రెండింగ్
-
100HP టర్బో ఇంజిన్‌తో Renault Triber Turbo కొత్త వేరియంట్ లాంచ్.. ధర ఎంతంటే.?
-
Rohit-Kohli: నేను కోహ్లీకి పెద్ద ఫ్యాన్.. కానీ ఇప్పుడు చాలా బాధగా ఉంది.. రోహిత్ ఆసక్తికర వ్యాఖ్యలు!
-
మారిన లుక్, సరికొత్త ఫీచర్లతో Suzuki Hayabusa Special Edition లాంచ్.. ధరనే కాస్త ఎక్కువే.!
-
Woman Auto Driver: ఐటీ To ఆటో డ్రైవర్.. హృదయాలను కదిలిస్తున్న యువతి కథ..!
-
Ai+ నుంచి మూడు కొత్త డివైజ్‌లు.. కొత్త స్మార్ట్ ఫోన్ తోపాటు, 5G ట్యాబ్లెట్ సెగ్మెంట్ లాంచ్.!