NTV Telugu Site icon

Nirmala Sitharaman: నాదీ మధ్యతరగతే.. వారి సమస్యలేంటో తెలుసు

Niramala Sitharanam

Niramala Sitharanam

Nirmala Sitharaman Shares Her Plans On Middle Class Taxes In Union Budget: బడ్జెట్ సమావేశాలకు ముందు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ కీలక వ్యాఖ్యలు చేశారు. తాను మధ్యతరగతి కుటుంబం నుంచే వచ్చానని.. ఆ వర్గం ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలను కూడా అర్థం చేసుకుంటానని అన్నారు. ‘‘నేను మధ్యతరగతికి చెందినదాన్నే. ఆ వర్గానికి చెందినవారు ఎలాంటి సమస్యలు ఎదుర్కుంటారో నేను అర్థం చేసుకోగలను. మోడీ ప్రభుత్వం ఏ బడ్జెట్‌లోనూ మధ్యతరగతి వారిపై కొత్త పన్ను విధించలేదు. రూ.5 లక్షల జీతం ఆర్జించే వారిపై ఎలాంటి పన్నులు లేవు’’ అంటూ ‘బాత్ భారత్ కీ’లో భాగంగా ‘పాంచజన్య’తో ఇంటరాక్షన్‌లో చెప్పారు. కేంద్రం 100 స్మార్ట్ సిటీల అభివృద్ధికి అవసరమైన నిధులు విడుదలను విడుదల చేసిందని.. వ్యాపారం, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలస వెళ్ళే ప్రజలకు ఇది సహాయపడుతుందని ఆమె పేర్కొన్నారు. ‘‘ఈ కార్యక్రమాలు జీవన ప్రమాణాన్ని మెరుగుపరచలేదా?’’ అంటూ ప్రశ్నించారు. అవును, నేనేమీ మధ్యతరగతి వారి జేబుల్లోకి నేరుగా డబ్బును వేయలేదు కానీ, ఈ సౌకర్యాలు వారికి సహాయం అందిస్తున్నాయని అన్నారు.

Phone Power Shock: ఫోన్ మాట్లాడుతుండగా యువతికి కరెంట్ షాక్.. మరో ఇద్దరికీ..

ఇదే సమయంలో.. రాజకీయ పార్టీల ఉచితాల విషయాలపై, తమ రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని పరిగణనలోకి తీసుకుని, వాగ్దానం చేయదలిచిన ఉచితాలకు తమ బడ్జెట్‌లో కేటాయింపులు చేయాలని నిర్మలా కోరారు. ఉచితాలేమిటన్నది ప్రశ్న కాదని.. రాష్ట్ర ఆర్థిక పరిస్థితిని దృష్టిలో ఉంచుకుని ఎన్నికలకు ముందు రాజకీయ పార్టీలు ఇచ్చిన హామీలను నెరవేర్చగలరా అన్నదే ప్రశ్న అని పేర్కొన్నారు. అలాగే.. బలహీనమైన 5 ఆర్థిక వ్యవస్థల నుండి భారతదేశం ఎలా బయటపడిందనే దాని గురించి ఆమె మాట్లాడుతూ.. 2014 నుండి భారతదేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మార్పులకు గురైందని, ఇది ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థ అని వెల్లడించారు. ‘‘2013లో మన దేశం ప్రపంచంలోని ‘బలహీనమైన ఐదు’ ఆర్థిక వ్యవస్థలలో ఒకటిగా ఉంది. కానీ.. 2014లో మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దేశ ఆర్థిక వ్యవస్థ గణనీయమైన మార్పులకు గురైంది. ఇప్పుడు ప్రపంచంలోనే అత్యంత వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా అవతరించింది’’ ఆమె చెప్పింది. కాగా.. వచ్చే ఆర్థిక సంవత్సరానికి వార్షిక బడ్జెట్‌ను రూపొందించడానికి అధికారిక కసరత్తు అక్టోబర్ 10 నుండి ప్రారంభమైంది.

VSR Box-office: బాలయ్య సెంచరీ… బాక్సాఫీస్ దగ్గర గాడ్ ఆఫ్ మాసెస్ ర్యాంపేజ్

Show comments