Nirmala Sitharaman, 5 Other Indians Among Forbes’ 100 Most Powerful Women: ఫోర్బ్స్ ప్రపంచంలో 100 మంది శక్తివంతమైన మహిళల జాబితాలో భారతీయ మహిళలకు చోటు దక్కింది. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ ఈ జాబితాలో చోటు సంపాదించారు. 2022కు సంబంధించి ఈ జాబితాలో కేంద్రమంత్రితో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా, నైకా వ్యవస్థాపకుడు ఫల్గుణి నాయర్‌లతో కలిపి మొత్తం ఆరుగురు భారతీయులు చోటు దక్కించుకున్నారు. ఈ జాబితాలోొ నిర్మలా సీతారామన్ 36వ స్థానంలో నిలిచారు. 2021లో 37వ స్థానంలో, 2020లో 41 వస్థానంలో, 2019లో 34వ స్థానంలో ఇలా వరసగా నాలుగోసారి ఆమె జాబితాలో చోటు సంపాదించారు.
Read Also: Shraddha Walker Case: కేసులో మరో ట్విస్ట్.. శ్రద్ధా మరో వ్యక్తితో రాత్రంతా గడిపి..
నిర్మలా సీతారామన్ తో పాటు బయోకాన్ ఎగ్జిక్యూటివ్ చైర్‌పర్సన్ కిరణ్ మజుందార్-షా(72 ర్యాంక్), నైకా వ్యవస్థాపకుడు ఫల్గుణి నాయర్(89 ర్యాంక్), హెచ్‌సిఎల్‌టెక్ చైర్‌పర్సన్ రోష్నీ నాడార్ మల్హోత్రా(53వ ర్యాంక్), సెక్యూరిటీస్ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా (సెబి) చైర్‌పర్సన్ మధాబి పూరి బుచ్(54 ర్యాంక్), స్టీల్ అథారిటీ ఆఫ్ ఇండియా చైర్‌పర్సన్ సోమా మోండల్(67వ ర్యాంక్) ఈ జాబితాలో చోటు దక్కించుకున్నారు.
ఉక్రెయిన్ యుద్ధ సమయంలో, కోవిడ్-19 మహమ్మారి కట్టడిలో సమర్థవంతంగా పనిచేసిన ఈయూ కమిషన్ ప్రెసిడెంట్ ఉర్సులా వాన్ డెర్ లేయెన్ ఈ జాబితాలో ఫస్ట్ ప్లేస్ లో నిలిచారు. యూరోపియన్ సెంట్రల్ బ్యాంక్ ప్రెసిడెంట్ క్రిస్టీన్ లగార్డ్ 2వ స్థానంలో ఉండగా, అమెరికా వైస్ ప్రెసిడెంట్ కమలా హారిస్ ఈ జాబితాలో 3వ స్థానంలో నిలిచారు. ఇరాన్ వ్యాప్తంగా హిజాబ్ వ్యతిరేక ఉద్యమానికి కారణం అయింది మహ్సా అమిని మరణం. ఈ ఏడాది మహ్సా అమిని ఈ జాబితాలో 100వ స్థానంలో నిలిచారు. ఫోర్బ్స్ ప్రకటించిన ఈ జాబితాల 39 మంది వివిధ కంపెనీలకు చెందిన సీఈఓలు ఉండగా.. 10 దేశాధినేతలు, 11 బిలియనీర్లు ఉన్నారు.