MPs At Parlament: పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా విపక్ష ఎంపీల నిరసన దీక్ష.. మణిపూర్ పై ఆరని మంటలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
MPs At Parlament: మణిపూర్‌లో జరుగుతున్న మారణకాండపై ప్రతిపక్షాలు పార్లమెంటును స్థంభింపచేస్తున్నాయి. మణిపూర్ సమస్యపై చర్చించాలని ఇటు లోక్‌సభతోపాటు.. రాజ్యసభలో ప్రతిపక్షాలు పట్టుబట్టాయి. ప్రతిపక్షాల నిరసనలతో పార్లమెంటు స్థంభించిన విషయం తెలిసిందే. దీంతో పార్లమెంటును వాయిదా వేశారు. కేంద్ర ప్రభుత్వ వైఖరికి నిరసనగా పార్లమెంట్ ఆవరణలో విపక్ష ఎంపీలు పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు. సోమవారం రాత్రంతా నిరసన దీక్ష చేపట్టారు. రెండు జాతుల మధ్య చెలరేగిన ఘర్షణలతో ఈశాన్య రాష్ట్రం మణిపూర్ మూడు నెలలుగా అట్టుడుకుతున్న విషయం తెలిసిందే. తాజాగా ఈ మణిపూర్ హింసాకాండ పార్లమెంట్ ను కుదిపేస్తోంది. ఆందోళనలు, అల్లర్లు, హింసాకాండ ఘటనలతో మణిపూర్ అట్టుడుకుతుంటే ప్రధాని మోదీ కనీసం మాట్లాడటం లేదని విపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఈ అంశంపై మోదీ తక్షణమే సమాధానం చెప్పాలంటూ డిమాండ్ చేస్తున్నాయి. ప్రతిపక్ష నేతల నినాదాలు, ఆందోళనలు, నిరసనలతో పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు మూడు రోజులుగా స్తంభిస్తున్నాయి.
Read also: Polavaram: ఏపీకి తెలంగాణ లేఖ.. పోలవరం గేట్లన్నీ తెరిచే ఉంచాలి..
Also Read
- B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
- Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
- UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
- Chandigarh University: ఫ్రెషర్స్ వేడుకలో అసభ్యకర డ్యాన్స్.. నెట్టింట తీవ్ర విమర్శలు
వర్షాకాల సమావేశాలు వరుసగా మూడో రోజైన సోమవారం పార్లమెంట్ లో మణిపూర్ అంశంపై ప్రతిష్టంభన కొనసాగింది. ఉభయ సభలు ప్రతిపక్షాల ఆందోళనలతో అట్టుడికాయి. ప్రతిపక్ష నాయకుల నినాదాలతో సభలు హోరెత్తాయి. మణిపూర్ అంశంపై ప్రధాని సమాధానం చెప్పాలని మొదటి నుంచి డిమాండ్ చేస్తున్న ప్రతిపక్షాలు వెనక్కి తగ్గడం లేదు. ఈ నేపథ్యంలో విపక్ష ఎంపీలు సోమవారం రాత్రి పార్లమెంట్ ఆవరణలోని మహాత్మా గాంధీ విగ్రహం ముందు నిరసన కొనసాగించారు. మణిపూర్ లో జరుగుతున్న హింసాకాండపై ప్రధాని మోదీ సమగ్ర ప్రకటన చేయాలంటూ ప్రతిపక్ష కూటమి అయిన ‘ఇండియా’ పార్లమెంట్ ఆవరణలో రాత్రంతా ఆందోళన చేపట్టింది. ‘మణిపూర్ కోసం భారత్’, ‘భారత్ డిమాండ్ మణిపూర్’ ప్లకార్డులు, బ్యానర్లను ప్రదర్శిస్తూ నిరసన కొనసాగించారు. ఆప్, కాంగ్రెస్, తృణమూల్ కాంగ్రెస్ సహా ఇండియా కూటమిలోని ప్రతిపక్ష పార్టీల ఎంపీలు ఈ ఆందోళనలో పాల్గొనడం విశేషం.
తాజావార్తలు
-
Ukraine War: ఉక్రెయిన్‌లో తుస్సుమన్న పాకిస్తానీ మందుగుండు..
-
B.Tech Degree: ఇక నుంచి బీటెక్ 5 సంవత్సరాలు.. ప్రతిపాదించిన ఢిల్లీ ఐఐటీ మాజీ డైరెక్టర్..
-
AP Social Media Influencer Policy: సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లకు సర్కార్ గుడ్‌న్యూస్.. ఫాలోవర్లను బట్టి పారితోషికం..
-
Sahil Wakode Death: ‘‘నేను తప్పు చేశా’’.. ఆతహత్యకు ముందు స్నేహితురాలికి సాహిల్ చివరి కాల్..
-
UP: 2047 వరకు అఖిలేష్ కుటుంబంలో ఎవరూ ముఖ్యమంత్రి అవ్వరు.. యూపీ డిప్యూటీ సీఎం కీలక వ్యాఖ్యలు
ట్రెండింగ్
-
Veg Soup: వర్షంలో వేడివేడిగా హోటల్ రుచిని తలదన్నేలా ‘వెజ్ సూప్’ ఇంట్లోనే.. సులువుగా చేసేయండి ఇలా..!
-
IP69K రేటింగ్, 8000mAh బ్యాటరీ, 144Hz AMOLED డిస్ప్లేతో సెప్టెంబర్ 29న రానున్న OPPO K14 Plus..!
-
IP66+IP68+IP69 రేటింగ్స్, 200MP+200MP కెమెరాలు, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 సిరీస్ లాంచ్.!
-
Match-Fixing: నన్ను ఇరికించే ప్రయత్నం చేశారు.. భారత క్రికెట్లో మ్యాచ్ ఫిక్సింగ్ కలకలం!
-
ట్రిపుల్ 200MP కెమెరాలు, 1.5K 144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో OPPO Find X10 Pro Max ఫ్లాగ్షిప్ లాంచ్.!