NTV Telugu Site icon

నేటి నుంచి కర్ఫ్యూ, ఆదివారం సంపూర్ణ లాక్‌డౌన్..

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసులతో పాటు, ఒమిక్రాన్‌ పాజిటివ్‌ కేసులు కూడా టెన్షన్ పెడుతున్నాయి.. తగ్గినట్టే తగ్గిన కోవిడ్‌ మళ్లీ పంజా విసురుతుండగా.. మరోవైపు.. కొత్త వేరియంట్‌ ఒమిక్రాన్‌ కేసులు కూడా పెరుగుతూ పోతున్న నేపథ్యంలో.. దేశంలోని పలు రాష్ట్రాలు ఆంక్షలు బాటపడుతున్నాయి.. కోవిడ్‌ నేపథ్యంలో తమిళనాడు సర్కార్‌ కూడా కీలక నిర్ణయం తీసుకుంది.. ఇవాళ్టి నుంచి లాక్‌డౌన్‌ నిబంధనలు అమలు చేయాలని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎంకే స్టాలిన్‌ ఆదేశాలు జారీ చేశారు.. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం ఇవాళ్టి (గురువారం) రాత్రి 10 గంటల నుంచి ఉదయం 5 గంటల వరకు నైట్‌ కర్ఫ్యూ అమలు చేయనున్నారు.. ఇక, ఆదివారాల్లో సంపూర్ణ లాక్‌డౌన్‌ అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది.

Read Also: రేషన్‌ షాపులో సంక్రాంతి మామూళ్లు.. డబ్బా పెట్టి మరీ..!

లాక్‌డౌన్‌ సమయంలో అత్యవసర సర్వీసులకు మినహాయింపు ఇచ్చింది స్టాలిన్‌ సర్కార్.. ఇక, ఆదివారం ఉదయం 7 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు టేక్ అవే సర్వీస్ అందించేందుకు రెస్టారెంట్లకు పర్మిషన్ ఇచ్చారు. మరోవైపు ఒకటి నుంచి 9వ తరగతి విద్యార్థులకు కేవలం ఆన్లైన్ క్లాసులు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేశారు.. 10, 12 తరగతుల వారికి మాత్రమే ప్రత్యక్ష తరగతులు నిర్వహించాలని విద్యాశాఖ అధికారులను ఆదేశించారు సీఎం స్టాలిన్.. పండుగల సీజన్లో వైరస్ వ్యాప్తి మరింత పెరిగే ప్రమాదం ఉన్న నేపథ్యంలో పొంగల్ పండుగకు సంబంధించి ఎలాంటి కార్యక్రమాలకు అనుమతి లేదని స్పష్టం చేవారు.. బస్సులు, సబర్బన్ ట్రైన్లు, మెట్రో సర్వీసులు కేవలం 50శాతం సీటింగ్ కెపాసిటీతో నడుస్తాయని వెల్లడించారు.. శుక్ర, శని, ఆదివారాల్లో ప్రార్థనా మందిరాల్లోకి భక్తులను అనుమతించబోమని స్పష్టం చేశారు సీఎం ఎంకే స్టాలిన్‌.