Site icon NTV Telugu

మళ్లీ నైట్ క‌ర్ఫ్యూ: రాత్రి 9 తరువాత అన్నీ బంద్‌…

దేశంలో క‌రోనా కేసులు పెరుగుతున్నాయి.  ముఖ్యంగా కేర‌ళ‌, మ‌హారాష్ట్ర‌లో రోజువారీ కేసుల సంఖ్య భారీగా పెరుగుతున్నాయి.  దీంతో పొరుగునున్న రాష్ట్రాలు కీల‌క నిర్ణ‌యాలు తీసుకుంటున్నాయి.  క‌ర్ణాట‌క రాష్ట్రం క‌రోనాను క‌ట్ట‌డి చేసే క్ర‌మంలో ఆంక్ష‌లు విధించేందుకు సిద్ధ‌మయింది.   రాత్రిస‌మ‌యంలో క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  రాత్రి 9 గంట‌ల నుంచి ఉద‌యం 5 గంట‌ల వ‌ర‌కు కర్ఫ్యూ అమ‌లుచేయాల‌ని నిర్ణ‌యం తీసుకున్నారు.  అత్య‌వ‌స‌ర్ విభాగాల‌కు నైట్ క‌ర్ఫ్యూ నుంచి స‌డ‌లింపులు ఇచ్చారు.  నిబంధ‌న‌లు ఉల్లంఘిస్తే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటామ‌ని ప్ర‌భుత్వం ప్ర‌క‌టించింది.  వారాంతాల్లో కేర‌ళ‌, మ‌హారాష్ట్ర స‌రిహ‌ద్దు ప్రాంతాల్లో వారాంతాల్లో పూర్తిస్థాయి క‌ర్ఫ్యూ విధించాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  బెంగ‌ళూరు న‌గ‌రంలో రాత్రి 9 గంట‌ల త‌రువాత ఫ్లైఓవ‌ర్లు మూసివేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యం తీసుకుంది.  

Read: పెళ్ళి ప్లాన్స్ చెప్పేసిన కియారా !

Exit mobile version