Site icon NTV Telugu

NIA: కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది ఐఎస్ ఉగ్రవాదులను దోషులుగా తేల్చిన కోర్టు..

Nia

Nia

NIA court convicts 8 suspected IS operatives: కాన్పూర్ ఉగ్రవాద కుట్ర కేసులో 8 మంది అనుమానిత ఇస్లామిక్ స్టేట్ (ఐఎస్) ఉగ్రవాదులను ఎన్ఐఏ కోర్టు దోషులుగా తేల్చింది. లక్నోలోని ఎన్ఐఏ ప్రత్యేక కోర్టు ఈ 8 మంది ఉగ్రవాద కుట్రలో పాలుపంచుకున్నారని కోర్టు వీరిని దోషులుగా నిర్దారించింది. ఉగ్రవాద అణిచివేతలో ఇది పెద్ద విజయం అని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) పేర్కొంది. అయితే త్వరలోనే వీరందరికి కోర్టు శిక్ష విధిస్తుందని ఎన్ఐఏ తెలిపింది.

2017లో కాన్పూర్ కుట్ర కేసులో 8 మంది దోషులు ఉగ్రవాద చర్యలకు ప్లాన్ చేసి అరెస్ట్ చేశారు. ఈ కేసును మొదటగా లక్నోలని ఏటీఎస్ పోలీస్ స్టేషన్ నమోదు చేయగా.. ఆ తరువాత ఎన్ఐఏకు అప్పగించారు. వీరంతా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాద సంస్థ కోసం పనిచేస్తూ.. ఐఈడీలు తయారు చేసి పరీక్షించారని, ఉత్తర్ ప్రదేశ్ లోని పలు ప్రాంతాల్లో వీటిని అమర్చి పేల్చడానికి యత్నించినట్లు ఎన్ఐఏ కోర్టులో తెలిపింది. లక్నోలోని దోషుల రహస్య ప్రదేశం నుంచి నోట్ బుక్ స్వాధీనం చేసుకున్నారు అధికారు. వీటిలో బాంబుల తయారీకి సంబంధించి వివారాలు ఉన్నట్లు ఏన్ఐఏ పేర్కొంది.

Read Also: Pakistan Economic Crisis: ఉద్యోగులకు జీతాల్లేవ్.. చెల్లించే స్థితిలో లేని పాక్..

నిందితులు ఐఈడీలను తయారుచేస్తున్నారని, ఆయుధాలు, మందుగుండు సామాగ్రి, ఐఎస్ఐఎస్ జెండాతో పాటు పలు ఫోటోలను కూడా కనుగొన్నట్లు ఎన్ఐఏ తెలిపింది. వివిధ ప్రాంతాల నుంచి అక్రమ ఆయుధాలు, పేలుడు పదార్థాలను కూడా సేకరించినట్లు ఎన్ఐఏ తెలిపింది. మార్చి 7, 2017లో భోపాల్-ఉజ్జయిని ప్యాసింజర్ రైలులో జరిగిన పేలుడులో ఈ 8 మంది దోషులు కూడా పాల్గొన్నారు. ఈ దాడిలో 10 మంది గాయపడ్డారు. ప్రస్తుతం ఈ కేసు విచారణలో ఉంది.

ఈ కేసులో ప్రధాన నిందితుడు కాన్పూర్ నగర్ కు చెందిన మహ్మద్ ఫైసల్ ను రైలు పేలుడులో పాల్గొనందుకు అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసులో పురోగతి వచ్చింది. అతడు వెల్లడించిన వివరాలతో అతని సహచరులు గౌస్ మహ్మద్ అలియాస్ కరణ్ ఖత్రి, అజర్ ఖాన్ అలియాస్ అజర్ ఖలీఫా, ఆసిఫ్ ఇక్బాల్ అలియాస్ రాకీలను అధికారులు అరెస్ట్ చేశారు. వీరంతా ఉత్తర్ ప్రదేశ్ రాష్ట్రానికి చెందిన వారే. భారత్ లో ఐసిస్ భావజాలాన్ని వ్యాపించేందుకు దోషులు ప్రయత్నించారు. ఇస్లామిక్ స్టేట్ దాని నాయకుడి అబూబకర్ అల్ బాగ్దాదీకి విధేయత ప్రకటించి ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్నారని విచారణలో తేలింది.

Exit mobile version