NIA: ఉగ్రకదలికలపై ఎన్‌ఐఏ సోదాలు.. ఆదివారం పలు రాష్ట్రాల్లో దాడులు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
NIA: దేశంలో ఉగ్ర కదలికలపై జాతీయ దర్యాప్తు సంస్థ(ఎన్ఐఏ) ప్రత్యేక నిఘా పెట్టింది. ఆదివారం 8 రాష్టాల్లో భారత్‌లో ఐసిస్ ఉగ్రసంస్థ కార్యకలాపాలపై నమోదైన కేసుల దర్యాప్తులో భాగంగా దాడులు చేసింది. 13 ప్రాంతాల్లో ఏకకాలంలో తనిఖీలు నిర్వహించింది. స్థానికులకు ఐసిస్‌తో ఉగ్ర లింకులపై ఆరాతీసింది. ఉగ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న అనుమానంతో పలువురిని అదుపులోకి తీసుకొంది. నిజామాబాద్ జిల్లా ఆర్మూర్ పట్టణంలోని జిరాయత్ నగర్‌లో కూడా ఎన్‌ఐఏ ఆదివారం సోదాలు నిర్వహించడం గమనార్హం. జిరాయత్ నగర్‌లో ఎన్‌ఐఏ అధికారులు ఓ యువకుడిని అదుపులోకి తీసుకొన్నారు. సదరు యువకుడికి విదేశాల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, నగదు లావాదేవీలపై ఆరా తీస్తున్నట్లు సమాచారం.
Covid Cases: దేశంలో భారీగా తగ్గిన కరోనా కేసులు.. కొత్తగా ఎన్నంటే?
Also Read
- JNUలో ‘ఫ్రీ ఉమర్ ఖాలిద్’ నినాదాలు.. అసలేం జరుగుతోంది?
- JPSC: పబ్లిక్ సర్వీస్ కమిషన్ సభ్యుల రాజీనామా.. 13 పరీక్షల్లో అక్రమాలు.. రాంచీకి వేలాదిగా తరలి వెళ్లిన విద్యార్థులు..
- Boy Living in Pond: చెరువే ఇల్లు.. నీటిలోకి దిగితేనే ఉపశమనం! ఐదేళ్లుగా ఇదే జీవితం.. 16 ఏళ్ల బాలుడి జీవితంలో మిస్టరీ ఏంటి?
- IRCTC Sri Lanka Ramayana Yatra 2026: రామాయణ పుణ్యక్షేత్రాలతో శ్రీలంక టూర్.. విమానం, హోటల్, భోజనం అన్నీ ప్యాకేజీలోనే!
మధ్యప్రదేశ్, గుజరాత్, బిహార్, కర్ణాటక, మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, తెలంగాణ, కేరళల్లో ఎన్‌ఐఏ అధికారులు సోదాలు చేసి నేరమయ డాక్యుమెంట్లు, వస్తువులను స్వాధీనం చేసుకున్నారు. యూపీలోని దేవ్‌బంద్‌లోని ఓ మదర్సాలో కర్ణాటకకు చెందిన ఫరూక్ అనే విద్యార్థిని ప్రశ్నించి పంపించారు. ఉగ్ర సంబంధాల ఆరోపణలపై కర్ణాటకలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. కర్ణాటకకు చెందిన ఫరూక్ యూపీలోని దేవబంద్‌లో ఓ మదర్సాలో ఉంటున్నాడు. పాక్ ఐఎస్‌ఐతో అతనికి సంబంధాలున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణకు వచ్చిన ఎన్‌ఐఏ ఆదివారం ఫరూక్‌ను అదుపులోకి తీసుకొంది. ఐసిస్‌కు సంబంధించి నమోదైన ఓ కేసులో గుజరాత్‌లో ముగ్గురు అనుమానితులను ఎన్‌ఐఏ ప్రశ్నించింది. తీవ్రవాద సంస్థలతో సంబంధాలున్నాయన్న ఆరోపణలతో తమిళనాడులోని ఆంబూరుకు చెందిన మీరా అనాస్ అలీ(22)ని అదుపులోకి తీసుకొంది. అతని గది నుంచి ఒక ల్యాప్‌టాప్, రెండు మొబైల్ ఫోన్లు సిమ్ కార్డులను అధికారులు స్వాధీనం చేసుకున్నారు.
తాజావార్తలు
-
Colombia Earthquake : కొలంబియాలో భారీ భూకంపం.. 47 మంది మృతి, కూలిన భవనాలు.!
-
OTR : అసెంబ్లీకి వైసీపీ..? DSC రచ్చ వేళ కూటమి అలర్ట్.. బీసీ బిల్లుపై కీలక నిర్ణయం..!
-
Chairmans Desk : దేశంలో వ్యవస్థలు ఎటు పోతున్నాయి..? పాలన కంటే రాజకీయమేముఖ్యమైపోయిందా..?
-
OTR: రెడ్ ఐ ఎవరి మీద..?
-
Chit Fund Scam: రూ.2,000 కోట్ల చిట్‌ఫండ్ స్కామ్.. వెల్ఫేర్ గ్రూప్‌పై ఈడీ దాడులు..
ట్రెండింగ్
-
Kitchen Hacks : నూనె సీసాల జిడ్డు పోవాలంటే.. ఈ 4 చిట్కాలు ట్రై చేయండి.!
-
Bathroom Drain Cleaning Tips : బాత్రూమ్ డ్రెయిన్ జామ్ అవుతోందా? ఈ 2 పదార్థాలతో చిటికెలో క్లీన్.!
-
Home Hacks : కడాయి హ్యాండిల్‌పై గట్టి జిడ్డా? ఈ చిట్కాలతో కొత్తదానిలా మెరిపించండి.!
-
Cleaning Hacks : కిచెన్ డస్ట్‌బిన్ స్మెల్ కొడుతోందా.? ఇలా చేస్తే క్షణాల్లో క్లీన్.!
-
Pressure Cooker Rice Tips: కుక్కర్లో అన్నం పర్ఫెక్ట్గా రావాలంటే ఇదే సీక్రెట్.!