NTV Telugu Site icon

Christopher Luxon: ఢిల్లీ వీధుల్లో పిల్లలతో క్రికెట్ ఆడిన న్యూజిలాండ్ ప్రధాని

Christopherluxon

Christopherluxon

న్యూజిలాండ్ ప్రధాని క్రిస్టోఫర్ లక్సాన్‌ భారత్‌లో పర్యటిస్తున్నారు. మంగళవారం ప్రధాని మోడీ.. పలువురు కేంద్ర పెద్దలతో సమావేశం అయ్యారు. ఇక ఇరుదేశాల ద్వైపాక్షిక సంబంధాలపై సంతకాలు జరిగాయి. బిజిబిజీగా గడిపిన క్రిస్టోఫర్ లక్సాన్‌.. ఏమనుకున్నారో ఏమో తెలియదు గానీ.. కాసేపు సామాన్యుడిలా మారిపోయారు. ఆట విడుపు కోసం పిల్లాడిలా మారిపోయారు. అంతే ఢిల్లీ వీధుల్లోకి వెళ్లి.. చిన్నారులతో కలిసి క్రికెట్ ఆడారు. కొద్దిసేపు బ్యాటింగ్ చేసిన తర్వాత.. బౌలింగ్ చేశారు. న్యూజిలాండ్ మాజీ క్రికెటర్ రాస్‌ టేలర్‌ కూడా ఈ ఆటలో పాల్గొన్నారు. ఇందుకు సంబంధించిన దృశ్యాలను లక్సాన్‌ తన ‘ఎక్స్‌’లో పోస్టు చేశారు. భారత్‌, న్యూజిలాండ్‌ను దగ్గర చేయడంలో క్రికెట్‌ను మించింది మరొకటి లేదని చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఇందుకు సంబంధించిన దృశ్యాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.

ఇటీవల దుబాయ్ వేదికగా జరిగిన ఐసీసీ ఛాంపియన్స్‌ ట్రోఫీ ఫైనల్‌లో న్యూజిలాండ్‌పై టీమిండియా 4 వికెట్ల తేడాతో గెలిచి కప్పు సాధించింది. ఈ టోర్నమెంట్ తర్వాత న్యూజిలాండ్ ప్రధాని భారత్‌లో పర్యటించడం విశేషం.