New Twist in Delhi Student Killing Case: దేశ రాజధాని ఢిల్లీలోని ఒక పార్క్‌లో హత్యకు గురైన విద్యార్థిని కేసులో తాజాగా కొత్త కోణం వెలుగు చూసింది. కమలా నెహ్రూ కాలేజీ విద్యార్థిని అయిన ఆమెను నర్గీస్‌గా గుర్తించారు. ఆమెను చంపింది ఎవరో స్నేహితుడు కాదని, వరుసకు సోదరుడు అయ్యే ఇర్ఫాన్ (28) హతమార్చాడని వెల్లడైంది. పెళ్లికి నిరాకరించడం వల్లే అతడు ఈ దారుణానికి ఒడిగట్టినట్టు విచారణలో తేలింది. అతడు ఫుడ్ డెలివరీ బాయ్‌గా పని చేస్తున్నాడు. ఇర్ఫాన్‌కు సరిగ్గా ఆదాయం లేకపోవడం వల్ల.. యువతి కుటుంబసభ్యులు వీరి పెళ్లికి నిరాకరించారు. ఇక అప్పటి నుంచి నర్గీస్ అతడ్ని దూరం పెట్టడం మొదలుపెట్టింది. ఒకానొక దశలో మాట్లాడటం మానేసింది.
Kerala: భార్యకు భయపడి ఇంటి నుంచి పారిపోయిన భర్త.. విషయమేంటంటే?
దీంతో తీవ్ర మనోవేదనకు గురైన ఇర్ఫాన్.. తనకు దక్కనిది మరెవ్వరికీ దక్కకూడదన్న ఉద్దేశంతో నర్గిస్‌ని చంపాలని నిర్ణయించుకున్నాడు. మాల్వియా నగర్‌లో కోచింగ్ క్లాసెస్‌కి పార్క్ గుండూ ఆమె వెళ్తుందన్న సంగతి అతనికి తెలుసు. అక్కడే హతమార్చాలని అతడు పథకం రచించాడు. గురువారం 12 గంటల సమయంలో పార్క్‌కి చేరుకున్న అతడు, నర్గిస్‌తో మాట్లాడేందుకు ప్రయత్నించాడు. అందుకు ఆమె నిరాకరించడంతో తీవ్ర కోపాద్రిక్తుడైన ఇర్ఫాన్.. ఇనుప రాడ్‌తో ఆమెపై దాడి చేశాడు. ఆమె చనిపోయిందనుకున్న విషయం నిర్ధారించుకొని, అక్కడి నుంచి పారిపోయాడు. ఈ సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే రంగంలోకి దిగి.. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అలాగే.. బాడీ వద్ద లభ్యమైన ఇనుప రాడ్‌ను స్వాధీనం చేసుకున్నారు. పోలీసులు నిందితుడి కోసం గాలింపు చర్యలు చేపట్టి, కొన్ని గంటల్లోనే పట్టుకున్నారు. అతడ్ని అదుపులోకి తీసుకొని విచారిస్తున్నారు.
Uttar Pradesh: భర్తను అతి కిరాతకంగా గొడ్డలితో నరికి చంపిన భార్య..
మరోవైపు.. ఈ ఘటనపై ఢిల్లీ మహిళా కమిషన్ స్వాతి మలివాల్ సీరియస్‌గా స్పందించారు. ‘‘ఒకవైపు ఒక మహిళను తన ఇంటి బయటే కాల్చి చంపేస్తే, మరోవైపు మాల్వియా నగర్ వంటి పాష్ ప్రాంతంలో ఒక అమ్మాయిని రాడ్‌తో కొట్టి చంపేశారు. మహిళలకు ఢిల్లీ నగరం అసురక్షితంగా మారింది. ఇది ఎవరికీ పట్టింపు లేదు. వార్తాపత్రికల్లో కేవలం పేర్లు మారుతున్నాయే తప్ప, వారిపై జరుగుతున్న అఘాయిత్యాలు మాత్రం ఆగడం లేదు’’ అంటూ ట్విటర్ మాధ్యమంగా ఆవేదన వ్యక్తం చేశారు.