Site icon NTV Telugu

Tamil Nadu: పెంపుడు జంతువులపై కొత్త ఆంక్షలు.. నిబంధనలు ఉల్లంఘిస్తే..!

Petdogs

Petdogs

పెంపుడు జంతువులపై తమిళనాడు రాజధాని చెన్నైలో కొత్త ఆంక్షలు జారీ అయ్యాయి. చెన్నై మహా నగరపాలక సంస్థ కౌన్సిల్ కీలక నిర్ణయం తీసుకుంది. కుక్క, పిల్లి పెంచడానికి లైసెన్స్ తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. లైసెన్స్ లేకుండా కుక్కను, పిల్లిని పెంచితే ఐదు వేల రూపాయల జరిమానా విధించనున్నారు. ఇక శునకాల మెడలో బెల్ట్ లేకుండా పార్క్‌లకు తీసుకుని వస్తే రూ.500 ఫైన్ విధించాలని నిర్ణయం తీసుకుంది. మున్సిపాలిటీ ఆదేశాలను తప్పనిసరిగా పాటించాలని ఆదేశించింది.

ఇది కూడా చదవండి: India Women’s Team: చరిత్ర సృష్టించిన భారత మహిళా జట్టు.. పురుషుల వల్ల కూడా కాలేదు!

ఈ మధ్య దేశంలో కుక్కల బెడద ఎక్కువైంది. కుక్క కాటు కారణంగా చాలా మంది రేబిస్ వ్యాధితో చనిపోతున్నారు. ఈ నేపథ్యంలో దేశ సర్వో్న్నత న్యాయస్థానం కూడా సీరియస్ అయింది. కుక్కల బెడద నుంచి ప్రజలను కాపాడాలని ఆదేశాలు ఇచ్చింది. దీనిపై జంతు ప్రేమికులు వ్యతిరేకత వ్యక్తమైనా చర్యలు తీసుకోవాలని సూచించింది. తాజాగా మరోసారి కూడా హెచ్చరించింది. ఈ మేరకు రాష్ట్రాలకు నోటీసులు కూడా జారీ చేసింది.

ఇది కూడా చదవండి: Newlywed Woman Suicide: కాళ్ల పారాణి ఆరకముందే కాటికి.. పెళ్లైన మూడు రోజులకే నవ వధువు..

ఇక పెంపుడు జంతువులపై ఆంక్షలు ఉన్నాయి. పెంపుడు జంతువులు పెంచుకోవాలంటే లైసెన్స్ తీసుకోవాలి. లైసెన్స్ ప్రకారం జంతువులను పెంచుకోవడానికి ఉంటుంది. ఇందుకోసం కొన్ని కండీషన్స్ ఉంటాయి. ఆ నియమ, నిబంధనలు పాటించి పెంచుకోవాల్సి ఉంటుంది. లేదంటే అధికారులు జరిమానా విధిస్తారు.

ఇది కూడా చదవండి: Off The Record: జూబ్లీహిల్స్ జంబో బ్యాలెట్ ఎవరి కొంప ముంచబోతుంది?

Exit mobile version