LPG Cylinder Booking New Rules: దేశంలో LPG గ్యాస్ సిలిండర్ వినియోగదారులకు ఆయిల్ కంపెనీలు కొత్త బుకింగ్ నియమాలను అమలు చేస్తున్నాయి.. గ్యాస్ వినియోగాన్ని సమతుల్యం చేయడం, సబ్సిడీ దుర్వినియోగాన్ని తగ్గించడం లక్ష్యంగా ఈ మార్పులు తీసుకువచ్చినట్లు తెలుస్తోంది. భారతదేశంలో గ్యాస్ సరఫరా నిర్వహిస్తున్న Indian Oil Corporation, Bharat Petroleum, Hindustan Petroleum సంస్థలు ఈ నియమాలను అమలు చేస్తున్నట్టు చెబుతున్నాయి.. కొత్త నియమాల ప్రకారం, డబుల్ సిలిండర్ కలిగిన వినియోగదారులు ఒక సిలిండర్ డెలివరీ అయిన తర్వాత కనీసం 35 రోజుల గడువు పూర్తయిన తర్వాతే రీఫిల్ బుకింగ్ చేయాలి. అదే విధంగా, Pradhan Mantri Ujjwala Yojana పథకం కింద గ్యాస్ కనెక్షన్ పొందిన వారికి 45 రోజుల తర్వాత మాత్రమే బుకింగ్ అనుమతించబడుతుంది.
Read Also: What’s Today: ఈ రోజు ఏమున్నాయంటే..?
అయితే, సింగిల్ సిలిండర్ కలిగిన వినియోగదారులకు కొంత సడలింపు ఇస్తూ, 25 రోజుల తర్వాత రీఫిల్ బుకింగ్ చేసుకునే అవకాశం కల్పించారు. గడువు తేదీకి ముందు సిలిండర్ బుక్ చేయడానికి ప్రయత్నిస్తే, ఆ బుకింగ్ ఆటోమేటిక్‌గా రద్దు అవుతుందని స్పష్టం చేస్తున్నాయి ఆయిల్ కంపెనీలు.. పట్టణ, గ్రామీణ ప్రాంతాలకు కూడా ఇదే నిబంధన వర్తిస్తుందని.. ఈ నియమాలు అన్ని ప్రాంతాల్లో ఒకే విధంగా ఉంటాయని చెబుతున్నారు.. ఈ మార్పులతో గ్యాస్ సరఫరాలో పారదర్శకత పెరగడం, అవసరమైన వారికి సమయానికి సిలిండర్లు అందేలా చేయడం ప్రధాన ఉద్దేశ్యంగా కనిపిస్తోంది.
