NTV Telugu Site icon

Building Collapses: ఢిల్లీలో కూలిన నాలుగు అంతస్తుల భవనం.. 12 మందిని రక్షించిన అధికారులు

Delhi

Delhi

Building Collapses: దేశ రాజధాని నగరం ఢిల్లీలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. నగరంలో కొత్తగా నిర్మించిన నాలుగు అంతస్తుల భవనం కుప్ప కూలిపోయింది. బురారీ ప్రాంతంలోని ఆస్కార్‌ పబ్లిక్‌ స్కూల్‌ సమీపంలో కౌశీక్‌ ఎన్‌క్లేవ్‌ అనే భవనం సోమవారం రాత్రి 7 గంటల సమయంలో కూలింది. విషయం తెలుసుకున్నా.. పోలీసులు, అగ్నిమాపక, ఢిల్లీ డిజాస్టర్‌ మేనేజ్‌మెంట్‌ అథారిటీ, ఎన్డీఆర్‌ఎఫ్‌ బృందాలు సంఘటన ప్రదేశానికి చేరుకొని సహాయక చర్యలు కొనసాగించాయి.

Read Also: Hyderabad: మాదాపూర్ శ్రీ చైతన్య కాలేజీ కిచెన్ లైసెన్స్ సస్పెండ్..

అయితే, శిథిలాల కింద చిక్కుకున్న 12 మందిని రక్షించి ఆస్పత్రులకు తరలించారు. ఇక, రక్షించిన వారిలో 6, 14 ఏళ్ల అమ్మాయిలు ఇద్దరు ఉన్నారని ఢిల్లీ ఫైర్‌ సర్వీసెస్‌ చీఫ్‌ అతుల్‌ గార్గ్‌ వెల్లడించారు. మరో 10 మంది వరకు శిథిలాల కింద ఉండొచ్చని అనుమానం వ్యక్తం చేస్తున్నారు. కాగా, ఈ ఘటనపై ఆమ్‌ ఆద్మీ పార్టీ కన్వీనర్‌, మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్‌ విచారం వ్యక్తం చేశారు. సహాయక చర్యలు చేపట్టాలని తమ ఎమ్మెల్యే సంజీవ్‌ ఝా, పార్టీ కార్యకర్తలను ఆయన ఆదేశించినట్టు పేర్కొన్నారు.