Site icon NTV Telugu

NEET UG Counselling: నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా.. అప్పటి వరకు జరపొద్దు…

Neet

Neet

NEET UG Counselling: వైద్య విద్య కోర్సుల్లో ప్రవేశాల కోసం నిర్వహించిన నీట్ యూజీ పరీక్షల్లో జరిగిన అక్రమాలపై తీవ్ర ఉత్కంఠ కొనసాగుతుంది. అయితే, ఈ వివాదం వేళా నీట్ యూజీ కౌన్సెలింగ్ వాయిదా పడింది. ఇవాళ్టి నుంచి జరగాల్సిన కౌన్సిలింగ్‌‌ ని అధికారులు పోస్ట్ పోన్ వేశారు. తదుపరి ఉత్తర్వులు వచ్చే వరకు కౌన్సిలింగ్‌ వాయిదా వేసినట్లు పేర్కొన్నారు. ఇటీవల నీట్‌ యూజీ పరీక్షలో పేపర్‌ లీకేజీలు, గ్రేస్‌ మార్కుల వ్యవహారంతో తీవ్ర వివాదం చెలరేగింది. దీంతో దేశవ్యాప్తంగా విద్యార్థి సంఘాలు, నేతలు ఆందోళన వ్యక్తం చేశారు. ఇకపోతే, సుప్రీంకోర్టులో సోమవారం ఈ కేసు విషయంలో వాదనలు కొనసాగాయి. కాగా.. నీట్‌ కౌన్సెలింగ్‌ను వాయిదా వేసేందుకు సుప్రీంకోర్టు నిరాకరించినప్పటికీ ఎన్‌టీఏ ఈ నిర్ణయం తీసుకోవడం గమనార్హం అని చెప్పొచ్చు.

Read Also: Mukesh Ambani dance : అనంత్-రాధికల సంగీత్ లో కుటుంబంతో కలిసి డ్యాన్స్ చేసిన అంబానీ ఫ్యామిలి (వీడియో)

అయితే, ఈ ఏడాది మే 5న దేశవ్యాప్తంగా నీట్‌ యూజీ 2024 పరీక్షను నిర్వహించారు. కానీ, ఈ పేపర్‌ లీక్‌ కావడంతో పాటు పరీక్ష నిర్వహణలో అవకతవకలు చోటు చేసుకున్నట్లు న్యూస్ వైరల్ కావడంతో దేశవ్యాప్తంగా నిరసనలు వ్యక్తం అయ్యాయి. ఫలితాల్లో ఏకంగా 67 మందికి జాతీయ స్థాయిలో మొదటి ర్యాంకు రావడం పైనా అనేక అనుమానాలు వచ్చాయి. నీట్‌ అభ్యర్థుల్లో 1563 మందికి గ్రేస్‌ మార్కులు కలపడం, ఓఎంఆర్‌ షీట్లు అందకపోవడం, న్యాయస్థానం పర్యవేక్షణలో విచారణ సహా నీట్‌ను రద్దు చేయాలన్న డిమాండ్లతో సుప్రీం కోర్టులో దాదాపు 26 పిటిషన్లు దాఖలు అయ్యాయి.

Exit mobile version