NTV Telugu Site icon

NEET-PG Exam: ఈ నెలలో నీట్-పీజీ ఎగ్జామ్.. పరీక్షకు 2 గంటల ముందే ప్రశ్నాపత్రం..

Neet

Neet

NEET-PG Exam: పోస్టు గ్రాడ్యుయేషన్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశానికి నీట్-పీజీ ఎగ్జామ్‌ని ఈ నెలలో నిర్వహించేందుకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. మంగళవారం హోం మంత్రిత్వ శాఖ ప్రభుత్వ సైబర్ క్రైమ్ నిరోధక సంస్థ అధికారులతో సమావేశమైన తర్వాత ఈ విషయంపై సంబంధిత వర్గాలు సమాచారమిచ్చాయి. ప్రశ్నాపత్రం పరీక్షకు కేవలం 2 గంటల ముందే తయారు చేయబడుతుందని తెలుస్తోంది. జూన్ 23న షెడ్యూల్ చేయబడిన NEET-PG పరీక్ష కొన్ని గంటల ముందు వాయిదా పడింది. నీట్ యూజీ ఎగ్జామ్ పేపర్ లీకుల వ్యవహారంతో అధికారులు నీట్ పీజీ పరీక్షను వాయిదా వేశారు.

Read Also: Team India: జింబాబ్వే టూర్లో మార్పులు.. ఐపీఎల్లో సత్తా చాటిన యంగ్ ప్లేయర్ల కు అవకాశం

నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ వైద్య విద్యార్థుల కోసం నిర్వహించే నీట్ పీజీ ప్రక్రియ పటిష్టతను పూర్తిగా అంచనా వేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. విద్యార్థుల ప్రయోజనాల దృష్ట్యా ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకున్నట్లు చెప్పింది. పరీక్ష కోసం దూర ప్రాంతాలకు వచ్చిన విద్యార్థులు రద్దు నిర్ణయంతో తీవ్ర నిరాశ చెందారు. తమ నిరసన తెలిపారు.

నీట్-యూజీ, నెట్-యూజీసీ పరీక్ష పత్రాలు లీక్ కావడం ఇటీవల దేశవ్యాప్తంగా సంచలనంగా మారాయి. ఈ వ్యవహారంపై కాంగ్రెస్‌తో పాటు ప్రతిపక్షాలు బీజేపీ ప్రభుత్వంపై విరుచుకుపడ్డాయి. ఈ నేపథ్యంలో నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ(ఎన్‌టీఏ) బలోపేతానికి ప్రభుత్వం కమిటీని ఏర్పాటు చేసింది. ఇప్పటికే ఈ కేసులో లీకులకు పాల్పడిన వ్యక్తుల్ని సీబీఐ అరెస్ట్ చేసింది.