Site icon NTV Telugu

2021 గూగుల్‌ సెర్చ్‌లో నీరజ్‌ టాప్‌

టోక్యో ఒలపింక్స్‌లో స్వర్ణ పతకం సాధించి యావత్‌ దేశానికే గర్వకారణంగా నిలిచిన నీరజ్‌ చోప్రా మరో ఘనతను అందుకున్నాడు. 2021 ఏడాదికి గాను గూగుల్‌లో ఎక్కువగా శోధించిన వ్యక్తుల జాబితాలో టోక్యో ఒలంపిక్స్‌ స్వర్ణపతక విజేత నీరజ్‌ చోప్రా మొదటి స్థానంలో నిలిచాడు. అతని తర్వాతి స్థానాల్లో బాలీవుడ్‌ నటుడు షారుఖ్‌ఖాన్‌ తనయుడు ఆర్యన్‌ఖాన్‌, పంజాబీనటి షెహనాజ్‌గిల్‌, బాలీవుడ్‌నటి శిల్పాశెట్టి, భర్త రాజ్‌కుంద్రా, టెస్లా సీఈఓ ఎలాన్‌ మస్క్‌ ఉన్నారు.

వీరే కాకుండా ప్రముఖ బాలీవుడ్‌ నటుడు విక్కీ కౌశల్‌, ప్రముఖ బ్యాడ్మింటన్‌ క్రీడాకారిణి పీవీ సింధు, రెజర్లు భజరంగ్‌ పునీయా, సుశీల్‌కుమార్‌, బాలీవుడ్‌ నటుడు వరుణ్‌ధావన్‌ భార్యనటాషా దలాల్‌ ఉన్నారు. ఈ జాబితాకు సంబంధించిన వివరాలను గూగుల్‌ ప్రకటించింది. వీరే కాకుండా మరికొందరు ప్రముఖులు సైతం ఉన్నట్టు తెలిపింది. ఈ సారి గూగుల్‌ సెర్చ్‌లో అత్యధికంగా శోధించిన జాబితాలో నీరజ్‌ నిలవడంతో అతడు మరో రికార్డును స్వంతం చేసుకున్నట్లు అయింది.

Exit mobile version