Infosys Narayana Murthy: ఇండియాలోని ప్రజాస్వామ్యం, అలాగే జనాభా నియంత్రణపై దేశీయ టెక్ దిగ్గజం సహ వ్యవస్థాపకులు ఎన్‌ఆర్ నారాయణమూర్తి ఆందోళన వ్యక్తం చేశారు. కోల్‌కతాలోని టెక్నో ఇండియా యూనివర్శిటీ స్నాతకోత్సవంలో నారాయణ మూర్తి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన ఇండియాలోని పలు అంశాలపై విద్యార్థులకు సూచనలు చేశారు. యూనివర్సిటీ స్నాతకోత్సవంలో నారాయణ మూర్తి మాట్లాడుతూ.. ఎక్కడైతే ప్రతి పౌరుడు తన విశ్వాసాలను స్వేచ్ఛగా ఆచరించుకోవచ్చో.. అలాంటి సమాజంలో ప్రజాస్వామ్యం ఉత్తమంగా ఉంటుందన్నారు. ఇండియాలో దేశ జనాభా నియంత్రణకు సరైన ప్రాధాన్యం లేదని వెల్లడించిన ఆయన.. దేశంలోనో కొన్ని ప్రాంతాల్లో నియంత్రణ ఉన్నప్పటికీ.. చాలా ప్రాంతాల్లో దీన్ని పూర్తిగా విస్మరించారని అన్నారు.
Read also: Kushi: ‘ఖుషి’పై కాపీ ఆరోపణలు.. అసలు విషయం చెప్పేసిన డైరెక్టర్
నిజమైన ప్రజాస్వామ్యానికి నాలుగు స్వేచ్ఛలు ఉంటాయన్నారు. భావ ప్రకటన స్వేచ్ఛ, విశ్వాసాల మీద స్వేచ్ఛ, భయం నుంచి స్వేచ్ఛ, కోరికల పట్ల స్వేచ్ఛ అనే నాలుగు ఉంటాయని.. అమెరికా మాజీ అధ్యక్షుడు ఫ్రాంక్లిన్ డీ రూజ్‌వెల్ట్ మాటలు నారాయణ మూర్తి ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎమర్జెన్సీ సమయంలో బలవంతపు కుటుంబ నియంత్రణ చేయకపోవడం జనాభా నియంత్రణ జరగలేదన్నారు. భారతదేశంలో తలసరి భూమి లభ్యత అమెరికాలో కేవలం 7 శాతం, బ్రెజిల్‌లో 5 శాతం మాత్రమే ఉండగా.. పెద్ద భూభాగాన్ని కలిగి ఉన్న దేశాలలో భారతదేశ తలసరి భూమి చైనా కంటే మూడింట ఒక వంతు ఉందని నారాయణమూర్తి అన్నారు. ప్రపంచంలోని మంచినీటిలో భారతదేశంలో కేవలం 4 శాతం మాత్రమే ఉండగా.. ప్రపంచ జనాభాలో 16 శాతంగా ఉందన్నారు. జనాభా పెరుగుదల రేటును తగ్గించడం అత్యంత తక్షణ అవసరమని నారాయణ మూర్తి స్పష్టం చేశారు. భారతదేశం గత మూడు దశాబ్దాలుగా ప్రశంసనీయమైన ఆర్థిక పురోగతి ఉన్నప్పటికీ, పేదరికం, త్రాగునీరు, విద్య, పోషకాహారం, ఆరోగ్య సంరక్షణ వంటి వాటిలో ఇంకా కొన్ని సమస్యలను ఎదుర్కోవాల్సి వస్తున్నట్లు తెలిపారు. జనాభా పెరుగుదలను తగ్గించడం ఇప్పుడు చేయవల్సిన ముఖ్యమైన పని. జనాభా సమస్య రానున్న 20 నుంచి 25 ఏళ్లలో మన దేశంపై విధ్వంసం సృష్టించే అవకాశం ఉందంటూ వ్యాఖ్యానించారు.