Rajasthan: అంగన్వాడీ ఉద్యోగాల సాకుతో 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారం..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Rajasthan: రాజస్థాన్‌లో దారుణం వెలుగులోకి వచ్చింది. అంగన్వాడీ ఉద్యోగాలు ఇప్పిస్తామనే సాకుతో ఇద్దరు వ్యక్తులు 20 మంది మహిళలపై సామూహిక అత్యాచారానికి పాల్పడిన ఘటన రాష్ట్రంలోని సిరోహిలో జరిగింది. ఈ ఉదంతంలో ఇద్దరిపై కేసులు నమోదయ్యాయి. మున్సిపల్ కౌన్సిల్ చైర్పర్సన్ మహేంద్ర మేవాడా, మాజీ మున్సిపల్ కౌన్సిల్ కమిషనర్ మహేంద్ర చౌదరిపై సామూహిక అత్యాచారం కేసులో నిందితులుగా గుర్తించారు.
Read Also: BRS Balka Suman: సీఎం రేవంత్ పై కామెంట్స్.. బాల్క సుమన్ కు నోటీసులు
Also Read
- Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
- DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
- Accidnet: ఆఫ్ఘనిస్తాన్‌లో ఘోర ప్రమాదం.. లోయలో పడ్డ ట్రక్కు.. 22 మంది మృతి..
- Abhishek Banerjee: మమతా బెనర్జీ అల్లుడిని నడిరోడ్డు మీద ఉతికేసిండ్రు.. బట్టలు చింపి, రాళ్లు, గుడ్లతో కొట్టి రచ్చ రచ్చ!
అంగన్వాడీల్లో ఉపాధి కల్పిస్తామనే నెపంతో దాదాపు 20 మంది మహిళలపై ఇద్దరు నిందితులు అఘాయిత్యానికి పాల్పడ్డారు. పాలీ జిల్లాకు చెందిన ఓ మహిళ ఫిర్యాదుతో ఈ ఘటన వెలుగులోకి వచ్చింది. తనతో పాటు ఉద్యోగవకాశాలు కల్పిస్తామని దాదాపుగా 20 మంది మహిళల్ని మోసగించారని ఆమె ఫిర్యాదు చేసింది.
నిందితులు లైంగిక వేధింపులను చిత్రీకరించి, ఆ ఫుటేజీని సోషల్ మీడియాలో షేర్ చేస్తామని బెదిరించే వారని, బాధితుల నుంచి డబ్బు కోసం బ్లాక్ మెయిల్ చేసే వారని, ఒక్కొక్కరి నుంచి లక్షల రూపాయలు డిమాండ్ చేసినట్లు బాధిత మహిళ ఆరోపించింది. మహిళ చెప్పిన వివరాల ప్రకారం.. తనతో కలిసి కొందరు మహిళలు అంగన్వాడీలో పనిచేసేందుకు సిరోహి వెళ్లినట్లు, వారికి నిందితులు వసతి, భోజన సదుపాయాలు కల్పించారని, వారు వడ్డించిన భోజనంలో మత్తుమందు కలిపి, తిన్న తర్వాత మత్తులో జారుకున్నాక లైంగిక వేధింపులకు పాల్పడే వారని ఆమె ఆరోపించింది. స్పృహలోకి వచ్చిన తరువాత తమపై అఘాయిత్యానికి పాల్పడినట్లు తెలిసిందని, మహిళలు గతంలో తప్పుడు ఫిర్యాదు చేశారని డీఎస్పీ పరాస్ చౌదరి తెలిపిన క్రమంలో ప్రస్తుతం 8 మంది మహిళల పిటిషన్‌పై కేసు నమోదు చేయాలని రాజస్థాన్ హైకోర్టు ఆదేశించింది. కేసుకు సంబంధించిన విచారణ కొనసాగుతోంది.
తాజావార్తలు
-
AP Govt: భారీ శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. జూన్ 1వ తేదీ ఉదయం నుంచే ప్రారంభం..
-
Abhishek Banerjee: మమతా మేనల్లుడిని ప్రజలు ఎందుకు కొట్టారు..?
-
Heatwave : భారత్‌లో వేడి గాలులకు 30వేల మంది చనిపోతారా? అధ్యయనంలో సంచలన విషయాలు!
-
Mitsubishi Pajero: పజెరో మళ్లీ రానుందా? 2031 నాటికి 13 కొత్త వాహనాలపై మిత్సుబిషి ఫోకస్.. కొత్త SUV ఎలా ఉండబోతోందంటే?
-
DK Shivakumar: సీఎల్పీ నేతగా డీకే.శివకుమార్ ఎన్నిక.. జూన్ 3న సీఎంగా ప్రమాణస్వీకారం
ట్రెండింగ్
-
Munakkaya Pachadi: ఆరోగ్యం + టెస్ట్ సూపర్ కాంబో.. ‘మునక్కాయ పచ్చడి’ చేసేయండి ఇలా.!
-
Airtel మాస్టర్ ప్లాన్.. రూ.469కే 84 రోజుల వ్యాలిడిటీ.. పూర్తి డీటెయిల్స్ ఇలా.!
-
Frog Control Tips : ఇంట్లోకి కప్పలు రాకుండా ఉండాలా? ఈ సింపుల్ చిట్కాలు పాటించండి.!
-
Tea Ranking : ప్రపంచాన్ని గెలిచిన భారతీయ చాయ్.. ‘నంబర్ 1’గా మసాలా టీ రికార్డ్..!
-
Pachimirchi Avakaya: సీజన్‌తో పనిలేదు.. మామిడి ఆవకాయకు గట్టి పోటీ ఇచ్చే ‘పచ్చిమిర్చి ఆవకాయ’.! తింటే వావ్ అనాల్సిందే..