NTV Telugu Site icon

Mamata Banerjee: నరేంద్ర మోడీ సర్కార్ ఐదేళ్ల పాటు కొనసాగడం కష్టమే..?

Mamatha

Mamatha

Mamata Banerjee: భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలోని ఎన్డీయే ప్రభుత్వం ఐదేళ్లు కొనసాగడం కష్టమేనని పశ్చిమ బెంగాల్‌ సీఎం, టీఎంసీ అధినేత్రి మమతా బెనర్జీ వ్యాఖ్యనించారు. కేంద్ర ప్రభుత్వంలోని అస్థిరత స్పష్టంగా కనిపిస్తోంది.. అసలు ఆట ఇప్పుడే స్టార్ట్ అయిందని ఆమె తెలిపారు. అనంత్ అంబానీ వివాహ వేడుకలో పాల్గొన్న మమతా బెనర్జీ.. ఈ సందర్భంగా ఎన్సీపీ (ఎస్‌పీ) అధినేత శరద్‌ పవార్‌, శివసేన (యూబీటీ) చీఫ్ ఉద్ధవ్‌ థాక్రేలతో వేర్వేరుగా దీదీ సమావేశం అయ్యారు. ఈ భేటీల అనంతరం మమ తా బెనర్జీ ప్రెస్ మీట్ నిర్వహించారు.

Read Also: Govinda Namalu: శనివారం గోవింద నామాలు వింటే మీ ఇంట శుభాలు కలుగుతాయి..

కాగా, ఎమర్జెన్సీకి మేం వ్యతిరేకం అని బెంగాల్ సీఎం మమతా బెనర్జీ తెలిపారు. ప్రధాని మోడీ హయాంలోనే ఎమర్జెన్సీ పరిస్థితులు ఎక్కువగా కనపడుతున్నాయి. దేశంలో కొత్త చట్టాలను అమల్లోకి తెచ్చేటప్పుడు నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎవరినీ సంప్రదించలేదు.. పెద్ద సంఖ్యలో ఎంపీలు సస్పెన్షన్‌కు గురైన టైంలో ఆ చట్టాలను ఏక పక్షంగా ఆమోదించారు అంటూ దీదీ ఆరోపణలు గుప్పించారు. మహారాష్ట్ర అసెంబ్లీ ఎన్నికల్లో శివసేన (యూబీటీ) తరఫున ప్రచారం చేస్తానని మమతా బెనర్జీ ప్రకటించారు.