NTV Telugu Site icon

Chennai Drug seized: చెన్నైలో రూ.70 కోట్ల డ్రగ్స్ సీజ్.. ముగ్గురు అరెస్ట్

Chennaidrugseized

Chennaidrugseized

చెన్నైలోని నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు డ్రగ్స్‌పై ఉక్కుపాదం మోపారు. శ్రీలంకకు అక్రమంగా తరలిస్తుండగా రూ.70 కోట్ల విలువైన మెథాంఫెటమైన్‌ను స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్‌ రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేశారు. ఆరు కిలోల మెథాంఫెటమైన్.. ఒక కిలో మత్తు పదార్థాలను రికవరీ చేసుకున్నారు.

కిలంబాక్కం బస్టాండ్ దగ్గర రామ్‌నాడ్ జిల్లాకు చెందిన వ్యక్తిని అధికారులు అడ్డుకున్నారు. అతడి దగ్గర నుంచి 6 కిలోల మెథాంఫెటమైన్ స్వాధీనం చేసుకున్నారు. రెడ్‌హిల్స్‌లో ఒక కిలో మత్తు పదార్థాలను కూడా రికవరీ చేసుకున్నారు. ఇక అరెస్టైన వారిలో ఒకరు డీఎంకేకు చెందిన నేత కావడంతో ఈ వ్యవహారం పొలిటికల్‌గా హాట్ టాఫిక్‌గా మారింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. ఇక వీరి వెనుక ఏమైనా నెట్‌వర్క్ ఉందా? అన్న కోణంలో పోలీసులు ఆరా తీస్తున్నారు. తదుపరి విచారణలో రెడ్‌హిల్స్ ప్రాంతానికి సమీపంలో డ్రగ్స్ నిల్వ చేయడానికి ఉపయోగించే గోడౌన్ ప్రదేశాన్ని గుర్తించారు. గోడౌన్‌పై దాడి చేసి 954 గ్రాముల మెథాంఫెటమైన్, రూ.7 లక్షల నగదు కూడా స్వాధీనం చేసుకున్నారు.