NTV Telugu Site icon

Chhattisgarh: మావోయిస్టుల ఘాతుకం.. మందుపాతర పేలి 10 జవాన్లు మృతి..

Chhattisgarh

Chhattisgarh

Chhattisgarh: ఛత్తీస్‌గఢ్‌లో మావోయిస్టులు ఘాతుకానికి తెగబడ్డారు. బీజాపూర్ జిల్లాలో జవాన్లను టార్గెట్ చేస్తూ మందుపాతర పేల్చారు. వాహనంలో జవాన్లు వెళ్తున్న క్రమంలో మందుపాతర పేలి 10 మంది జవాన్లు మృతి చెందారు. జిల్లాలోని కుట్రు-బెద్రే రహదారిపై ఐఈడీని పేల్చారు. మరో ఐదుగురి జవాన్లకు తీవ్రగాయాలైనట్లు తెలుస్తోంది. పేలుడు సమయంలో వాహనంలో 15 మంది జవాన్లు ఉన్నారు. కూంబింగ్‌‌కి వెళ్లి వస్తున్న క్రమంలో ఈ పేలుడు చోటు చేసుకుంది. పేలుడు విషయాన్ని బస్తర్ ఐజీ ధ్రువీకరించారు.

Show comments