Site icon NTV Telugu

Punjab: సీఎంపై సిద్ధూ పైర్‌.. ఆయ‌నో ర‌బ్బర్ స్టాంప్..!

Navjot Singh Sidhu

Navjot Singh Sidhu

పంజాబ్‌ సీఎం భ‌గ‌వంత్ మాన్‌పై కాంగ్రెస్ నేత నవజ్యోత్‌ సింగ్‌ సిద్ధూ విరుచుకుపడ్డారు. ఆయ‌నో ర‌బ్బర్ స్టాంప్ సీఎం అంటూ ధ్వజమెత్తారు. అస‌లు పాల‌న అంతా ఢిల్లీ నుంచే సాగుతోంద‌ని, అరవింద్‌ కేజ్రీవాలే న‌డిపిస్తున్నార‌ని ఆరోపించారు సిద్ధూ… భ‌గ‌వంత్ మాన్ పాల‌నా ప‌గ్గాలు చేప‌ట్టిన త‌ర్వాత పంజాబ్‌లో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించిపోయాయన్నారు. రాష్ట్రంలో జ‌రుగుతున్న ప‌రిణామాల‌పై మాజీ సీఎం చెన్నీ, సిద్ధూతో స‌హా కాంగ్రెస్ నేత‌లు గ‌వర్నర్‌ భ‌న్వరీలాల్‌తో భేటీ అయ్యారు.. వాటిని గవర్నర్‌ దృష్టికి తీసుకెళ్లారు. కాగా, తాజాగా జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో పంజాబ్‌లో కాంగ్రెస్‌ పార్టీ ఘోర పరాజయం పాలు కాగా.. అనూహ్య విజయాన్ని అందుకుంది ఆమ్‌ఆద్మీ పార్టీ.. ఢిల్లీకే పరిమితం అనుకున్న ఆ పార్టీ.. పంజాబ్‌లో అధికార పగ్గాలు చేపట్టింది.. సీఎంగా భగవంత్‌ మాన్‌ ప్రమాణస్వీకారం చేసిన విషయం తెలిసిందే.

Read Also: Nitin Gadkari: ఎలక్ట్రిక్ వాహ‌నాల వరుస ప్రమాదాలు.. కేంద్రం సీరియస్‌

Exit mobile version