Site icon NTV Telugu

National Green Tribunal: తెలంగాణ సర్కార్ పై ఎన్జీటీ సీరియస్

అక్రమ కంకరమిషన్ల పై సరైన చర్యలు తీసుకోలేదని తెలంగాణ చీఫ్ సెక్రటరీ పై అసంతృప్తి వ్యక్తం చేసింది నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ (NGT). నిబంధనలకు విరుద్ధంగా జరుగుతున్న కార్యకలాపాలపై కన్నెర్ర జేసింది. ఉల్లంఘనలకు పాల్పడిన వారిపై ఎలాంటి చర్యలు తీసుకున్నారో, ఎంత జరిమానా విధించారో చెప్పలేదని ఎన్టీసీ అసహనం వ్యక్తం చేసింది.

చీఫ్ సెక్రటరీ నివేదిక సమగ్రంగా లేదని చెన్నై ఎన్జీటీ అభిప్రాయపడింది. పూర్తి వివరాలతో నివేదిక ఇవ్వాలని తెలంగాణ సీఎస్ ను ఆదేశించింది ఎన్జీటి. పిసటి ఇందిరరెడ్డి, ఎ.నిఖిల్ రెడ్డి దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ జరిపింది ఎన్జీటీ చెన్నై బెంచ్. తెలంగాణలో 734 కంకర మిషన్లు ఉండేవని ,ప్రసుత్తం 208 పని చేయడం లేదని, 74 కంకర మిషన్లు నిబంధనలకు విరుద్ధంగా ఉన్న కారణం తో మూసివేయించామని ఎన్జీటీకి తెలిపారు తెలంగాణ సీఎస్. అక్రమంగా మిషన్లు పని చేస్తున్నా పట్టించుకోని అధికారులపై క్రమశిక్షణ చర్యలు తీసుకున్నామని ఎన్జీటికి తెలిపారు తెలంగాణ సీఎస్. హైదరాబాద్ శివారులో మైనింగ్ జోన్ వల్ల తలెత్తుతున్న పర్యావరణ సమస్యల పై వాస్తవ నివేదిక ఇవ్వాలని కేంద్ర పర్యావరణ శాఖకు ఆదేశాలు ఇచ్చింది ఎన్జీటీ. తదుపరి విచారణ ఏప్రిల్ 28 కి వాయిదా వేసింది చెన్నై ఎన్జీటీ.

https://ntvtelugu.com/india-begins-covid-19-corbevax-vaccine-for-kids/
Exit mobile version