Site icon NTV Telugu

Nathuram Godse: నాథూరామ్ గాడ్సే ఫోటోతో తిరంగా యాత్ర..

Nathuram Godse Photo In Tiranga Yatra

Nathuram Godse Photo In Tiranga Yatra

Hindu Mahasabha takes out Tiranga yatra with Godse’s photo: భారత్ స్వాతంత్య్రం సాధించిన 75 ఏళ్లు పూర్తయిన సందర్భంగా ఆగస్టు 15న స్వాతంత్య్ర దినోత్సవాన్ని ఘనంగా జరుపుకున్నారు ప్రజలు. ఆజాదీ కా అమృత్ , హర్ ఘర్ తిరంగా పేరుతో దేశవ్యాప్తంగా పలు కార్యక్రమాలను చేపట్టింది. ప్రజలు కూడా ప్రతీ ఇంటిపై జాతీయ జెండాను ఎగరేశారు. ఇదిలా ఉంటే ఉత్తర్ ప్రదేశ్ ముజఫర్ నగర్ లో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో హిందూ మహాసభ చేసిన తిరంగా యాత్ర ఇప్పుడు వివాదాస్పదం అయింది. జాతి పిత మహాత్మాగాంధీని హతమార్చిన వ్యక్తి నాథూరామ్ గాడ్సే ఫోటోలతో తిరంగా యాత్రను చేపట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది.

సోషల్ మీడియా వ్యాప్తంగా నాథూరామ్ గాడ్సే ఫోటోలు పెట్టుకుని తిరంగా యాత్ర చేసిన వీడియోలు వైరల్ అవుతున్నాయి. హిందూమహాసభ ఓ జీపుకు గాడ్సే ఫోటోను పెట్టి దాన్ని అనుసరించడం ఈ వీడియోలో చూడొచ్చు. ఈ వివాదంపై హిందూ మహాసభ జాతీయాధ్యక్షుడు యోగేంద్ర వర్మ స్పందించారు. తమ కార్యకర్తలు ఆగస్టు 15న గాడ్సేతో పాటు పలువురు స్వాతంత్రయోధుల ఫోటోలతో యాత్ర నిర్వహించారని ఆయన అన్నారు.

Read Also: Kerala: కేరళలో దారుణం.. మైనర్ పై తండ్రి స్నేహితుల అత్యాచారం

ఆయన మాట్లాడుతూ.. గాంధీ జాతి వ్యతిరేక విధానాలకు పాల్పడటంతోనే గాడ్సే ఈ చర్యకు దిగాడని మేము విశ్వసిస్తున్నామని.. గాంధీ విధానాల వల్లే నాథూరామ్ గాడ్సే హత్య చేయాల్సి వచ్చిందని యోగేంద్ర వర్మ అన్నారు. గాడ్సే సొంతంగా తన కేసుపై పోరాడారని.. ఆయన కోర్టులో చెప్పినవన్నింటిని ప్రభుత్వం బహిరంగ పరచాలని.. గాంధీని ఎందుకు హత్య చేశారో ప్రజలకు తెలియడం ప్రభుత్వానికి ఇష్టం లేదని ాయన అన్నారు. గాంధీ హిందూ వ్యతిరేక విధానాల వల్ల విభజన సమయంలో 30 లక్షల మంది హిందువులు, ముస్లింలు చంపబడ్డారని.. దీనికి గాంధీయే బాధ్యుడని వర్మ పేర్కొన్నట్లు తెలిసింది.

Exit mobile version