కాబూల్ ఎయిర్‌పోర్ట్ వరస బాంబు పెలుళ్లతో దద్దరిల్లిపోతున్నది. ఇప్పటి వరకు ఎయిర్‌పోర్ట్ వద్ద 6 పేలుళ్లు జరిగాయి. ఈ పేలుళ్లలో 72 మంది మృతి చెందారు. ఇందులో సాధారణ పౌరులు 60 మంది ఉండగా, 13 మంది అమెరికా సైనికులు ఉన్నారు. మృతి చెందిన వారిలో మహిళలు, చిన్నారులు కూడా ఉన్నారు. ఈ పేలుళ్లు జరగడానికి కొన్ని గంటల ముందు కాబూల్ ఎయిర్‌పోర్ట్ నుంచి 160 మంది భారతీయులను ఇండియాకు తీసుకొచ్చారు. 160 మందిలో 145 మంది ఆఫ్ఘాన్ సిక్కులు ఉండగా, 15 మంది హిందువులు ఉన్నారు. ఆఫ్ఘనిస్తాన్‌లో ఇంకా వేలాది మంది భారతీయులు ఉన్నట్టు సమాచారం. భారతీయులందరినీ సురక్షితంగా ఇండియాకు తీసుకొస్తామని భారతప్రభుత్వం ఇప్పటికే ప్రకటించింది. కాబూల్ ఎయిర్‌పోర్ట్ వద్ద వరస పేలుళ్ల తరువాత, అక్కడ పరిస్థితులు దారుణంగా మారిపోవడంతో భారతీయులను ఎలా తరలిస్తారు అన్నది ఆసక్తికరంగా మారింది. ఎయిర్‌పోర్ట్ లోపల ఉన్నవారు గట్టి భద్రత మధ్య సురక్షితంగా ఉన్నారు. బయట ఉన్నవారి పరిస్థితి దారుణంగా మారింది. బయట ఉన్నవారిని లోనికి అనుమతించడం లేదు. మరోవైపు సామాన్యప్రజలతో కలిసి ఉగ్రవాదులు కూడా లోపలికి వస్తున్నారనే అనుమానాలు కలుగుతున్నాయి.
Read: షాకింగ్ సర్వే: 2064 తరువాత ప్రపంచ జనాభా భారీగా తగ్గుతుందా?
