NTV Telugu Site icon

Narendra Modi: మోదీకి పెరిగిన ప్రజామోదం.. తాజా సర్వేలో వెల్లడి

605983 Narendra Modi

605983 Narendra Modi

మహమ్మారి ప్రారంభం అయినప్పటి నుంచి పీఎం మోదీకి ప్రజామోదం పెరగింది. తాజాగా సోమవారం లోకల్ సర్కిల్స్ తాజా సర్వే వెల్లడింది. 64,000 మంది అభిప్రాయాలను తీసుకుంటే ఇందులో 67 శాతంమంది రెండో విడత అధికారం చేపట్టిన తర్వాత మోదీ ప్రభుత్వం అంచనాలను అందుకున్నట్లు వెల్లడించింది. కోవిడ్ సెకండ్ వేవ్ సమయంలో చాలా మరణాలు సంభవించాయి ఆ సమయంలో మోదీ ప్రజామోదం కేవలం 51 శాతం మాత్రమే ఉండేది. 2020 కోవిడ్ ప్రారంభం అయినప్పటి నుంచి ఇది 62 శాతానికి పెరిగింది.

కోవిడ్ మూడో వేవ్ వచ్చినా ప్రభుత్వం సిద్ధంగా ఉందని.. ఆర్థిక వ్యవస్థ సమర్థవంతంగా నిర్వహిస్తోందని సర్వేలో పాల్గొన్న వ్యక్తులు వెల్లడించారు. నిరుద్యోగం ఓ వైపు 7 శాతం వద్ద కొనసాగుతున్న పరిస్థితుల్లో సర్వే పోల్ లో పాల్గొన్న వారిలో 47 శాతం మంది సమస్యను పరిష్కరించలేకపోయిందని చెప్పారు. ఇదే సమయంలో 2022లో 37 శాతం మంది నిరుద్యోగిత సమస్యపై ప్రభుత్వం మీద విశ్వాసం ఉందని తెలిపారు. ఇది 2020లో 29 శాతం ఉంటే, 2021లో 27 శాతంగా ఉంది.

దేశంలో రిటైల్ ద్రవ్యోల్భనం పెరుగి ఎనిమిదేళ్ల గరిష్ట స్థాయికి చేరుకున్న సమయంలో కూడా ప్రధాని మోదీకి ప్రజామోదం పెరిగింది. గత మూడేళ్లలో నిత్యవసరాల ధరలు, జీవన వ్యాయలు తగ్గలేదని 73 శాతం భారతీయులు సర్వేలో వెల్లడించారు. 73 శాతం ప్రజలు తమ భవిష్యత్తు కుటుంబ భవిష్యత్తు గురించి ఆశాజనకంగా ఉన్నామని చెప్పారు. కాలుష్యాన్ని తగ్గించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదని 44 శాతం మంది, మత సామరస్యాన్ని మెరుగుపరచడంలో ప్రభుత్వం బాగా పనిచేస్తుందని 60 శాతం మంతి అంటే 44 శాతం మంది మాత్రం అంగీకరించలేదు. భారత్ లో వ్యాపారం చేయడం సులభతరం అని 50 శాతాని కన్నా ఎక్కువ మంది చెప్పారు.