నరేంద్రగిరి మృతిపై విచారణ వేగవంతం.. వెలుగులోకి కీలక అంశాలు..!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అఖిల భారతీయ అఖాడా పరిషత్ అధ్యక్షుడు మహంత్ నరేంద్రగిరి… అనుమానాస్పద మృతిపై పోలీసులు విచారణ వేగవంతం చేశారు. అలహాబాద్‌లోని బాఘంబరి మఠంలోని అతిథి గృహంలో పైకప్పునకు వేలాడుతూ ఆయన మృతదేహం కనపడినట్లు పోలీసులు వెల్లడించారు. తొలుత ఆయన మృతిని పోలీసులు ఆత్మహత్యగా భావించి… కేసు నమోదు చేశారు. అయితే, గదిలో లభించిన ఆత్మహత్య లేఖను స్వాధీనం చేసుకున్నారు. మానసికంగా తీవ్ర కలతకు గురైన తాను జీవితాన్ని ముగిస్తున్నట్లు అందులో రాసి ఉందని తెలిపారు.
ఆశ్రమంలోని శిష్యులను పోలీసులు విచారించడంతో… పలు కీలక అంశాలు వెలుగులోకి వచ్చాయి. నరేంద్ర గిరికి అత్యంత నమ్మకస్తుడిగా ఉండే ఆనంద్ గిరి అనే శిష్యుడు.. గతంలో ఆశ్రమంలో మోసాలకు పాల్పడ్డాడు. దీంతో అతడ్ని అక్కడి నుంచి బయటకు పంపించేశారు. అయితే కొన్ని రోజుల తర్వాత ఆనంద్ గిరి మళ్లీ నరేంద్ర వద్దకు వచ్చి క్షమించమని కోరడంతో… తిరిగి ఆశ్రమంలో చేర్చుకున్నట్లు తెలిసింది. నరేంద్ర గిరిని… ఆనంద్ పలుమార్లు వేధించినట్లు కొందరు పోలీసులకు తెలిపారు. ఆయన మరణించిన గది ముందు సీసీటీవీ ఫుటేజ్‌లను పరిశీలించారు పోలీసులు. వీటి ఆధారంగా ఆనంద్‌ను పోలీసులు అరెస్టు చేసి ఎఫ్‌ఐఆర్ నమోదు చేశారు. మరోవైపు, నరేంద్ర గిరిని హత్య చేసి ఉంటారనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. దీంతో ఆయన మృతిపై స్వతంత్ర కమిటీతో దర్యాప్తు జరిపించాలంటూ అలహాబాద్ హైకోర్టులో పిటిషన్ దాఖలైంది. మరోవైపు.. రేపు నరేంద్ర గిరి మృతదేహానికి పోస్టుమార్టం కూడా నిర్వహించేందుకు సిద్ధం అవుతున్నారు.. నిందితులను వదిలిపెట్టే ప్రసక్తే లేదని సీఎం యోగి ఆదిత్యనాథ్ ప్రకటించారు.
Also Read
- Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
- US: అమెరికాలో ఘోరం.. స్టోర్‌లో భారతీయ మహిళను కాల్చి చంపిన దుండగుడు.. వీడియో వైరల్
- Mamata Banerjee: కదులుతున్న తృణమూల్ పునాదులు.. వరుస షాక్‌లతో దీదీ విలవిల..
- DK Shivakumar: కర్ణాటక సీఎం రేసులో భారీ ట్విస్ట్.. పీసీసీ చీఫ్‌కు డీకే రాజీనామా..!
- Tags
తాజావార్తలు
-
బండోడి ట్యూన్‌కి బక్కోడి పాట.. Itlu Arjuna First Single ప్రోమో అదిరింది!
-
IPL Cricket Umpire Salary: కళ్లుచెదిరే శాలరీ.. రెండంటే రెండే నెలల్లో IPL అంపైర్లు ఎంత సంపాదిస్తున్నారో తెలిస్తే నోరెళ్లబెడతారు!
-
Big Alert : ఇంటర్ సిలబస్‌లో కీలక మార్పులు.. కొత్త టెక్స్ట్ బుక్స్, QR కోడ్లతో డిజిటల్ లెర్నింగ్
-
Annadata Sukhibhava Status : మీ అకౌంట్లో రూ.7,000 పడ్డాయా? ఆధార్‌తో ఇలా చెక్ చేయండి
-
Karnataka: కర్ణాటక కుర్చీ పంచాయితీ తుస్.. హైకమాండ్ చర్చలు అందుకోసమంట!
ట్రెండింగ్
-
రూ.11,999కే 6000mAh బ్యాటరీ, 120Hz డిస్ప్లేతో Lava SHARK 2 5G లాంచ్..!
-
వాతావరణం మారితే కలర్ మారుతున్న ఫోన్.. 12 కలర్ వేరియంట్స్, సరికొత్త AI ఫీచర్లతో Infinix HOT 70 లాంచ్.!
-
Nitish Kumar Reddy Birthday: టెక్నిక్ + టాలెంట్ + టెంపరమెంట్.. విశాఖ కుర్రాడి జర్నీ.!
-
Chicken Pickle Recipe: 4 నెలలు పాడవకుండా ఉండే ఆంధ్ర స్టైల్ స్పైసీ ‘చికెన్ పచ్చడి’.. ఒకసారి తింటే మళ్లీ మళ్లీ తినాలినిపించేలా చేయండి ఇలా.!
-
AIతో ఇంటర్వ్యూ మోసాలు.. కంపెనీల కొత్త ప్లాన్.!