NTV Telugu Site icon

Narayana Murthy: ప్రధానిగా అల్లుడు.. మామ ఆనందం..

Narayana Murthy

Narayana Murthy

బ్రిటన్‌ ప్రధానిగా రిషి సునాక్‌ చరిత్ర సృష్టించారు… భారత్‌ దేశవ్యాప్తంగా దీపావళి సంబరాలు జరుపుకుంటున్న సోమవారం రోజు ఈ వార్త తెలియడంతో.. భారతీయులు మరింత జోష్‌గా ఉత్సవాలు నిర్వహించారు.. అధికార కన్జర్వేటివ్‌ పార్టీ నాయకత్వ స్థానానికి పోటీ పడి బ్రిటన్‌ ప్రధానిగా ఎన్నికైన తొలి భారత సంతతి చెందిన నేత రిష్‌ సునాక్‌ కావడంపై సర్వత్రా హర్షం వ్యక్తం అవుతోంది.. దీనిపై ఆనందం వ్యక్తం చేశారు ఆయన మామ, ఇన్ఫోసిస్‌ ఫౌండర్‌ నారాయణమూర్తి… సోషల్‌ మీడియాలో తన సంతోషాన్ని వ్యక్తం చేస్తూ.. అతడు విజయం సాధించాలని ఆకాక్షించారు.. నారాయణమూర్తి కుమార్తె అక్షితా మూర్తిని రిషి సునాక్‌ 2009లో వివాహం చేసుకున్నారు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్న విషయం తెలిసిందే.

Read Also: Google Removes apps: మీ ఫోన్‌లో ఈ యాప్స్‌ ఉన్నాయా..? అయితే వెంటనే డిలీట్‌ చేయండి..

అయితే, తన అల్లుడు రిషి సునాక్‌ యూకే ప్రధాని కావడంపై తొలిసారి స్పందించిన నారాయణ మూర్తి.. “మేం అతనిని చూసి గర్విస్తున్నాం మరియు అతని విజయాన్ని కోరుకుంటున్నాం” అని ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి పేర్కొన్నారు.. “రిషికి అభినందనలు. మేం అతనిని చూసి గర్విస్తున్నాం మరియు అతని విజయాన్ని కోరుకుంటున్నాం” అంటూ ట్వీట్‌ చేశారు.. “యునైటెడ్ కింగ్‌డమ్ ప్రజల కోసం అతను తన వంతు కృషి చేస్తాడని మాకు నమ్మకం ఉంది.” అని రాసుకొచ్చారు. కాగా, ఫార్మసిస్ట్ తల్లి, డాక్టర్‌ అయిన తండ్రికి కుమారుడు రిషి సునాక్‌.. ఇంగ్లాండ్‌లోని అత్యంత ప్రసిద్ధ పాఠశాలల్లో ఒకటైన వించెస్టర్, ఆపై ఆక్స్‌ఫర్డ్‌లో చదువుకున్నారు.. ఆయన గోల్డ్‌మన్ సాక్స్ గ్రూప్ లో మూడు సంవత్సరాలు గడిపారు.. ఆ తర్వాత కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫోర్డ్ నుండి ఎంబీఏ పట్టా పొందాడు, అక్కడే అతనికి ఇన్ఫోసిస్ సహ వ్యవస్థాపకుడు నారాయణ మూర్తి కుమార్తె అయిన అక్షతా మూర్తి పరిచయం అయ్యింది.. అది కాస్తా ప్రేమగా మారి.. పెద్దలను ఒప్పించి పెళ్లి చేసుకున్నారు.. మొత్తంగా.. ఇన్ఫోసిస్‌ నారాయణమూర్తి అల్లుడు రిషి సునాక్‌ ఇప్పుడు బ్రిటన్‌ ప్రధాని కాబోతున్నారు.

Show comments