NTV Telugu Site icon

Nana Patole: ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై కాంగ్రెస్ చీఫ్ కీలక వ్యాఖ్యలు

Nana Patole

Nana Patole

మహారాష్ట్ర ముఖ్యమంత్రిగా దేవేంద్ర ఫడ్నవిస్ గురువారం ప్రమాణస్వీకారం చేశారు. మూడోసారి ముచ్చటగా సీఎంగా ప్రమాణం చేశారు. ఫడ్నవిస్‌తో పాటు డిప్యూటీ సీఎంలుగా ఏక్‌నాథ్ షిండే, అజిత్ పవార్ ప్రమాణస్వీకారం చేశారు. ఈ కార్యక్రమానికి ప్రధాని మోడీ, కేంద్రమంత్రులు అమిత్ షా, గడ్కరీ, ఎన్డీఏ ముఖ్యమంత్రులు, బాలీవుడ్ ప్రముఖులు, వ్యాపారవేత్తలు హాజరయ్యారు.

ఇది కూడా చదవండి: Union Cabinet: కేంద్ర కేబినెట్ కీలక నిర్ణయాలు.. ఏపీలో కొత్తగా 8 కేంద్రీయ విద్యాలయాలు

తాజాగా ఫడ్నవిస్ ప్రమాణస్వీకారంపై మహారాష్ట్ర కాంగ్రెస్ అధ్యక్షుడు నానా పటోలే స్పందించారు. ముఖ్యమంత్రి ప్రమాణస్వీకారానికి తమను ఆహ్వానించలేదన్నారు. ఫడ్నవిస్ తన మిత్రుడు అన్నారు. మిత్రుడు ముఖ్యమంత్రి అయినందుకు శుభాకాంక్షలు తెలుపుతున్నట్లు పేర్కొన్నారు. ప్రమాణస్వీకారానికి ప్రతిపక్ష సభ్యుల్ని పిలువలేదని ఆయన చెప్పుకొచ్చారు.

మహారాష్ట్రలో అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు వచ్చిన 12 రోజులకు ప్రభుత్వం ఏర్పడింది. 288 అసెంబ్లీ సీట్లుకు గాను బీజేపీ 132, శివసేన 57, ఎన్సీపీ 41, కాంగ్రెస్ 16, ఉద్ధవ్ థాక్రే 20, శరద్ పవార్ పార్టీ 10 సీట్లు సాధించాయి. ఇండియా కూటమి సరైన ఫలితాలను రాబట్టలేకపోయింది. నవంబర్ 20న ఎన్నికలు జరగగా.. ఫలితాలు నవంబర్ 23న విడుదలయ్యాయి.

ఇది కూడా చదవండి: Pushpa 2: బాస్ డైలాగులపై టీం స్ట్రాంగ్ వార్నింగ్!

Show comments