NTV Telugu Site icon

Chandrayaan-3: ఇండియాకు చంద్రయాన్-3 గేమ్ ఛేంజర్.. మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్..

Nambi Narayanan

Nambi Narayanan

Chandrayaan-3: ప్రస్తుతం ప్రపంచమంతా భారత్ నిర్వహిస్తున్న చంద్రయాన్-3 పైనే దృష్టిని కేంద్రీకరించాయి. చంద్రుడిపై ల్యాండర్, రోవర్ ని దించేందుకు చంద్రయాన్-3 మిషన్ ని ఇస్రో చేపట్టింది. ఇది సాధ్యమైతే ఈ ఘటన సాధించిన అమెరికా, రష్యా, చైనాల సరసన భారత్ నిలుస్తుంది. నాలుగేళ్ల క్రితం నిర్వహించిన చంద్రయాన్-2 ప్రయోగం పాక్షికంగా సఫలం అయింది. ఆర్బిటార్ చంద్రుడి చుట్టూ ప్రదక్షిణలు చేస్తోంది. అయితే ఈ ప్రయోగంలో పంపిన విక్రమ్ ల్యాండర్, రోవర్ చివరి క్షణాల్లో చంద్రుడిపై కుప్పకూలిపోయాయి. ఈ వైఫల్యాలను అధిగమించి చంద్రయాన్-3ని సక్సెస్ చేయాలని శాస్త్రవేత్తలు భావిస్తున్నారు. రేపు మధ్యాహ్నం ఎల్వీఎం-3 రాకెట్ సాయంతో చంద్రయాన్-3 అంతరిక్షంలో జాబిల్లి వైపు ప్రయాణించనుంది.

Read Also: Nikhil: ప్లాప్ ఎఫెక్ట్.. ఆ కండీషన్లు పెట్టిన నిఖిల్.. ?

ఇదిలా ఉంటే ఇస్రో మాజీ శాస్త్రవేత్త నంబి నారాయణన్ చంద్రయాన్-3 ప్రయోగంపై కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రయాన్-3 భారతదేశానికి గేమ్ ఛేంజర్ అవుతుందని అన్నారు. ప్రపంచ అంతరిక్ష వ్యాపారంలో భారత్ తన వాటాను పెంచుకునేందుకు ఈ ప్రయోగం సాయపడుతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. చంద్రయాన్-2తో సంభవించిన సమస్యలను నివారించడానికి చంద్రయాన్-3 సహాయపడుతుందని ఆయన అన్నారు. ఈ మిషన్ సక్సెస్ ఫుల్ అవుతుందని ఆయన ఆశాభావం వ్యక్తం చేశారు.

ఈ ప్రయోగం విజయవంతమైతే చంద్రుడిపై సాఫ్ట్ ల్యాండింగ్ చేసిన నాలుగో దేశంగా భారత్ అవతరిస్తుందని ఆయన అన్నారు. ఆర్థిక వ్యవస్థలో అంతరిక్ష వాటా పెరుగుతుంది. ప్రస్తుతం 600 బిలియన్ డాలర్ల పరిశ్రమలో ప్రస్తుతం 2 శాతం వాటాను కలిగి ఉంది. ఏరోస్పేస్ రంగంలో స్టారప్స్ వృద్ధికి ఆస్కారం పెంచుతుందని అన్నారు. దేశం మనుగడ సాగించాలంటే స్వదేశీ పరిజ్ఞానంతో అభివృద్ధి చెందిన సాంకేతికత అవసరమన్నారు. ఇతర దేశాలతో పోలిస్తే మన ప్రయోగాలకు ఖర్చు తక్కువ అని వెల్లడించారు.