NTV Telugu Site icon

Mysuru: లెహ్‌కు ట్రెక్కింగ్‌కి వెళ్లి శ్వాస అందక మైసూర్ ఇంజనీర్ మృతి

Mysuru

Mysuru

అంతా పకడ్బందీగా ఏర్పాట్లు చేసుకుని లేహ్‌‌కి ట్రెక్కింగ్ వెళ్లినా ప్రాణాలు నిలువలేదు. అర్ధాంతరంగా మైసూర్ ఇంజనీర్ ప్రాణాలు పోగొట్టుకున్నాడు. ఈ ఘటన కర్ణాటక రాష్ట్రంలో తీవ్ర కలకలం రేపింది.

నరేన్ కౌశిక్ (44) అనే ఇంజనీర్ ఏడుగురు స్నేహితులు, ఇద్దరు వైద్యులు, ఇద్దరు షెర్పాలతో కలిసి సెప్టెంబర్ 2న హర్యానా నుంచి లేహ్ వరకు ట్రెక్కింగ్ ప్రయాణాన్ని ప్రారంభించాడు. ఎత్తైన చోటుకు వెళ్లాక నరేన్ కౌశిక్‌కి శ్వాస సమస్యలు తలెత్తాయి. 18,000 అడుగుల ఎత్తులో ఉన్న అతనికి వైద్య సదుపాయాలు అందించారు. శతవిధాలా అతన్ని బ్రతికించేందుకు ప్రయత్నించినా సఫలీకృతం కాలేదు. దీంతో నరేన్ కౌశిక్ ప్రాణాలు వదిలాడు. సెప్టెంబర్ 7న లేహ్ సమీపంలో కౌశిక్ మరణించాడు.

ఇది కూడా చదవండి: Germany: జర్మనీలో అశోక చక్రవర్తి అవశేషాలు.. పరిశీలించిన భారత విదేశాంగ మంత్రి

సెప్టెంబరు 8 సాయంత్రం కౌశిక్ మరణవార్తను కుటుంబసభ్యులకు తెలియజేశారు. అవసరమైన లాంఛనాలు, శవపరీక్ష పూర్తయిన తర్వాత సెప్టెంబర్ 9 సాయంత్రం అతని మృతదేహాన్ని ఫ్యామిలీకి అప్పగించారు. ఆఖరి కర్మలు నిర్వహించేందుకు సమయం మించిపోయిన కారణంగా కుటుంబ సభ్యులు లేహ్‌లో సెప్టెంబరు 10 ఉదయం అంత్యక్రియలను నిర్వహించాలని నిర్ణయించుకున్నారు. ఆయన భౌతికకాయాన్ని లేహ్ దగ్గర సింధు నదిలో నిమజ్జనం చేశారు. ఈ కార్యక్రమాలు అన్ని జరిగేందుకు మైసూరు జిల్లా ఇన్‌చార్జి మంత్రి హెచ్‌సి సహా స్థానిక అధికారులు మహదేవప్ప, ముఖ్యమంత్రి మీడియా సలహాదారు కె.వి. ప్రభాకర్.. లేహ్ డిసి సంతోష్ సుఖదేవ్‌తో సమన్వయం చేసుకుని పనులు జరిగించారు. ఐజిపి సిఆర్‌పిఎఫ్ విపుల్ కుమార్, మైసూరు సిటీ పోలీస్ కమిషనర్ సీమా లట్కర్, ఇతర అధికారులు అంత్యక్రియలకు అదనపు సహాయాన్ని అందించారు.

ఇది కూడా చదవండి: KCR: సీతారాం ఏచూరి మృతి పట్ల బీఆర్ఎస్ అధినేత సంతాపం..

నరేన్ కౌశిక్ బెంగళూరులోని జీఈ ఎలక్ట్రికల్స్-మెడికల్ ఎక్విప్‌మెంట్‌లో డిప్యూటీ మేనేజర్‌గా ఉన్నారు. SJCE మైసూరు నుంచి BE పాలిమర్ సైన్స్ అండ్ టెక్నాలజీలో మూడవ ర్యాంక్ హోల్డర్. గతంలో టయోటా, ఫిలిప్స్, అంతర్జాతీయంగా US, మిడిల్ ఈస్ట్, UK, జర్మనీలలో పనిచేశాడు. కౌశిక్ విపరీతమైన ప్రకృతి ప్రేమికుడు. ఇప్పటికే అనేక ట్రెక్కింగ్ యాత్రలు చేపట్టాడు. అంతేకాకుండా నైపుణ్యం కలిగిన ఫ్లూటిస్ట్ కూడా.

కౌశిక్‌కు భార్య రాధిక, కుమార్తె వరుణి, తల్లిదండ్రులు ప్రొఫెసర్ ఆర్.ఎన్. పద్మనాభ, నాగరత్న పద్మనాభ, సోదరుడు పవన్ కౌశిక్ ఉన్నారు. ప్రస్తుతం వీరంతా ఆస్ట్రేలియాలోని బ్రిస్బేన్‌లో నివసిస్తున్నారు. సెప్టెంబర్ 18, 19 తేదీల్లో మైసూరులోని సరస్వతీపురంలోని వైష్ణవ సభలో ఆయన 12వ, 13వ రోజుల క్రతువులు జరగనున్నాయి.

ఇది కూడా చదవండి: Matka: చివరి రౌండ్ లో వరుణ్ తేజ్ ‘మట్కా’

Show comments