Mysore Pak: పహల్గామ్ ఉగ్రవాద దాడిలో 26 మంది పర్యాటకుల్ని, ముఖ్యంగా హిందువుల్ని మతం ఆధారంగా ఉగ్రవాదులు బలిగొన్నారు. ఈ దాడి తర్వాత దేశంలో ఒక్కసారిగా భావోద్వేగాలు ఎగిసిపడ్డాయి. పాకిస్తాన్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలంతా కోరారు. దీనికి అనుగుణంగానే ‘‘ఆపరేషన్ సిందూర్’’ ద్వారా భారత్, పాకిస్తాన్ భూభాగాలతో పాటు పీఓకేలోని లష్కరే తోయిబా, జైషే మహ్మద్ ఉగ్రవాద కార్యాలయాలు, వాటి ట్రైనింగ్ సెంటర్లపై దాడులు నిర్వహించింది. 100కి పైగా ఉగ్రవాదుల్ని హతమార్చింది.
Read Also: Maternity Leave: “ప్రసూతి సెలవులు” మహిళల హక్కుల్లో అంతర్భాగం: సుప్రీంకోర్టు..
ఇదిలా ఉంటే, పాక్ పేరంటేనే ఇప్పుడు భారత ప్రజలు సహించడం లేదు. ప్రముఖ స్వీట్ ‘‘మైసూర్ పాక్’’లో పాక్ ఉందని ఏకంగా దాని పేరు మార్చేస్తూ కొత్త పేర్లను పెడుతున్నారు. తాజాగా, జైపూర్‌లోని ఓ స్వీట్ షాప్ మైసూర్ పాక్‌ని ‘‘మైసూర్ శ్రీ’’గా మార్చారు. ‘‘మా స్వీట్ల పేర్ల నుంచి పాక్ అనే పదాన్ని తొలగించాము. ‘మోతీ పాక్’ పేరును ‘మోతీ శ్రీ’గా, ‘గోండ్ పాక్’ పేరును ‘గోండ్ శ్రీ’గా, ‘మైసూర్ పాక్’ పేరును ‘మైసూర్ శ్రీ’గా మార్చాము’’ అని దుకాణం యజమాని చెప్పారు. అయితే, నిజానికి మైసూర్ పాక్‌లో పాక్ అంటే ‘‘తీపి’’ అని కన్నడ భాషలో అర్థం.
