Site icon NTV Telugu

Jacqueline Fernandez: బేబీ నిన్ను మిస్సవుతున్నా.. జైలు నుంచి సుఖేష్ ప్రేమలేఖ

Jacqueline Fernandez, Sukesh Chandrashekhar

Jacqueline Fernandez, Sukesh Chandrashekhar

Jacqueline Fernandez: రెలిగేర్ మాజీ ప్రమోటర్ మల్వీందర్ సింగ్ భార్యను మోసం చేసి మనీలాండరింగ్ కేసులో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) సుఖేష్ చంద్రశేఖర్ ను అరెస్ట్ చేసింది. ప్రస్తుతం అతడు ఢిల్లీలోని మండోలి జైలులో ఉన్నారు. ఇదిలా ఉంటే ఆయన పుట్టిన రోజు సందర్భంగా బాలీవుడ్ యాక్టర్, సుకేష్ ప్రేయసి జాక్వలిన్ ఫెర్నాండేస్ కు లవ్ లెటర్ రాశాడు. ఆమెపై తనకున్న ప్రేమను ప్రేమలేఖలో వ్యక్త పరిచాడు.

Read Also: Julakanti Ranga Reddy: బీజేపీని తెలంగాణాలో అడుగు పెట్టనీయకుండా చేయాలి

‘‘నా బేజీ జాక్వెలిన్ అంటూ… నా బొమ్మా, నా పుట్టిన రోజున నేను నిన్ను మిస్సవుతున్నా, నా చుట్టు ఉన్న నీ ఎనర్జీని కోల్పోతున్నా, నాకు మాటలు రావడం లేదు, నాపై నీ ప్రేమ ఎప్పటికీ అంతం కాదు, నాకు ఫ్రూవ్స్ అవసరం లేదు బేబీ’’ అంటూ లేఖలో తన భావాన్ని వ్యక్త పరిచాడు. జాక్వెలిన్ ప్రేమను తన జీవితంతో అమూల్యమైన బహుమతిగా పేర్కొన్నాడు. ఏదైమైనా నీకు అండగా నేనున్నానని నీకు తెలుసు, నాకు నీ లవ్ పంచినందుకు థాంక్స్, నా బర్త్ డే సందర్భంగా విషెస్ చెప్పిన మద్దతుదారులకు, స్నేహితులందరికీ ధన్యవాదాలు తెలిపారు.

ఈ నెల ప్రారంభంలో కూడా అతడు జాక్వెలిన్ హోలీ శుభాకాంక్షలు చెబుతూ లవ్ నోట్ రాశాడు. రూ. 200 కోట్ల మనీలాండరింగ్ కేసులో సుకేష్ అరెస్ట్ అయ్యాడు. ఈ కేసులో జాక్వెలిన్ ను కూడా ఈడీ ప్రశ్నించింది. మరో యాక్టర్ నోరా ఫతేహి ను కూడా విచారించింది.

Exit mobile version