NTV Telugu Site icon

Maharashtra Political Crisis: నైతికత గురించి మాట్లాడే అర్హత ఉద్ధవ్ ఠాక్రేకు లేదు.. సుప్రీం తీర్పుపై ఫడ్నవీస్..

Devendra Fadnavis

Devendra Fadnavis

Maharashtra Political Crisis: మహరాష్ట్ర రాజకీయ సంక్షోభం, ఎమ్మెల్యేల అనర్హతపై సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. సీఎం ఏక్ నాథ్ షిండేతో పాటు 15 మంది ఎమ్మెల్యేల అనర్హత పిటిషన్ విచారించిన సుప్రీంకోర్టు ఐదుగురు న్యాయమూర్తుల ధర్మాసనం ఉద్ధవ్ ఠాక్రే ప్రభుత్వాన్ని పునరుద్ధరించడానికి నిరాకరించింది. షిండే వర్గానికి చెందిన భరత్ గోగావాలేను శివసేన విప్‌గా నియమిస్తూ హౌస్ స్పీకర్ తీసుకున్న నిర్ణయం చట్టవిరుద్ధమని సుప్రీం పేర్కొంది.

Read Also: Anasuya: ఓ.. ఆంటీ.. నిన్ను పబ్లిక్ ఫిగర్ ను చేసిందే.. మీడియా.. అది మర్చిపోకు

సుప్రీంతీర్పుపై బీజేపీ నేత, డిప్యూటీ సీఎం దేవేంద్ర ఫడ్నవీస గురువారం సంతృప్తి వ్యక్తం చేశారు. ఇది ప్రజాస్వామ్యం, ప్రజాస్వామ్య ప్రక్రియ విజయం అని ఆయన పేర్కొన్నారు. శివసేన-బీజేపీ ప్రభుత్వం చట్టబద్ధంగా, రాజ్యాంగబద్ధంగా ఏర్పడిందని ఫడ్నవీస్ అన్నారు. మహావికాస్ అఘాడీ(ఎంవీఏ) కుట్ర ఓడిపోయిందని అన్నారు.

శివసేన (యూబీటీ) వర్గం నేత ఉద్ధవ్ ఠాక్రే మాట్లాడుతూ.. మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఏక్ నాథ్ షిండే, డిఫ్యూటీ సీఎం ఫడ్నవీస్ నైతికంగా రాజీనామా చేయాలని ఆయన అన్నారు. ఆయన వ్యాఖ్యలపై స్పందించిన ఫడ్నవీస్.. నైతికత గురించి మాట్లాడే అర్హత ఉద్ధవ్ ఠాక్రేకి లేదని, అసెంబ్లీ ఎన్నికల్లో బీజేపీతో పొత్తుపెట్టుకుని గెలిచిన శివసేన ఆ తరువాత సీఎం పదవి కోసం ఎన్సీపీ, కాంగ్రెస్ తో వెళ్లినప్పుడు నైతికతను మరిచిపోయారా..? అని ప్రశ్నించారు. ఉద్దవ్ తో ఉన్న ఎమ్మెల్యేలు ఆయన్ను విడిచిపెట్టారని రాజీనామా చేశారు తప్పితే నైతికతతో రాజీనామా చేయలేదని ఫడ్నవీస్ విమర్శించారు.