Site icon NTV Telugu

Delhi Car Blast: డాక్టర్ షాహీనా గర్ల్‌ఫ్రెండ్ కాదు.. నా భార్య.. విచారణలో ముజమ్మిల్ వెల్లడి!

Delhi Car Blast

Delhi Car Blast

ఢిల్లీ బ్లాస్ట్‌పై దర్యాప్తు కొనసాగుతోంది. విచారణలో కీలక విసయాలు వెలుగులోకి వస్తున్నాయి. ఇప్పటికే కీలక విషయాలను దర్యాప్తు సంస్థలు రాబట్టాయి. అలాగే టెర్రర్ మాడ్యూ్ల్‌లో ఉన్న నిందితులందరినీ అరెస్ట్ చేశారు. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా ఉగ్ర డాక్టర్లు ఉమర్, షాహీన్, ముజమ్మిల్ కుట్ర పన్నినట్లుగా తేలింది. వీరికి సహకరించిన వారందరిని అరెస్ట్ చేస్తున్నారు.

ఇది కూడా చదవండి: Earthquake: ఇండోనేషియాను వణికించిన భారీ భూకంపం

ఇదిలా ఉంటే ఇటీవల డాక్టర్ షాహీన్-ముజమ్మిల్‌కు సంబంధించిన ఒక ఫొటో వైరల్ అయింది. ఒక షోరూమ్‌లో ఇద్దరూ కారు కొనుగోలు చేశారు. ఈ ఫొటో నిజమైందేనని అధికారులు కూడా నిర్ధారించారు. ఈ నేపథ్యంలో వారి మధ్య ఉన్న బంధంపై అధికారులు దృష్టి పెట్టి దర్యాప్తు చేపట్టగా విస్తుపోయే విషయాలు వెలుగులోకి వచ్చాయి.

డాక్టర్ షాహీనా తన గర్ల్‌ఫ్రెండ్ కాదని.. తన భార్య అని చెప్పుకొచ్చాడు. 2023లో నిఖా జరిగినట్లుగా చెప్పాడు. అల్‌-ఫలాహ్ యూనివర్సిటీ సమీపంలోనే వివాహం జరిగినట్లుగా తెలిపాడు. ఈ మేరకు అధికారుల సమాచారంతో జాతీయ మీడియాలో కథనాలు వెలువడుతున్నాయి.

ఇది కూడా చదవండి: Gold Rates: మగువలకు శుభవార్త.. తగ్గిన బంగారం ధరలు

డాక్టర్ షాహీన్.. భారతలో జైషే మహిళా విభాగంలో కీలక నేతగా కొనసాగుతోంది. ఈ క్రమంలోనే దేశ వ్యాప్త పేలుళ్లకు కుట్ర ప్లాన్ చేసింది. ఇందులో భాగంగా 2023లో ఆయుధాలు కొనేందుకు ముజమ్మిల్‌కు రూ.6.5 లక్షలు ఇచ్చిందని.. 2024లో డాక్టర్ ఉమర్‌కు ఫోర్డ్ ఎకోస్పోర్ట్స్ కారు కొనేందుకు రూ.3లక్షలు ఇచ్చినట్లుగా దర్యాప్తులో తేలింది. అలాగే టెర్రర్ మాడ్యూల్ ప్రకారం 28 లక్షలు ఇచ్చినట్లుగా సమాచారం. ఈ క్రమంలోనే షాహీన్-ముజమ్మిల్ బంధం బయటపడింది.

నవంబర్ 10న ఢిల్లీ ఎర్రకోట సమీసంలో జరిగిన కారు బ్లాస్ట్‌లో 15 మంది చనిపోయారు. పలువురు గాయపడ్డారు. బ్లాస్ట్ తర్వాత రంగంలోకి దిగిన అధికారులు.. అల్-ఫలాహ్ యూనివర్సిటీ కేంద్రంగా జరిగిన ఉగ్ర కుట్ర వెలుగు చూసింది. ఇప్పటికే యూనివర్సిటీ గుర్తింపు రద్దైంది.

Exit mobile version