Ram Temple Inauguration: అయోధ్య రామ మందిరం ప్రారంభోత్సవం ఈ రోజు జరిగింది. ప్రధాని మోడీ ముఖ్య అతిథిగా రామ్ లల్లా ప్రాణ ప్రతిష్టకు హాజరయ్యారు. ప్రధానితో పాటు దేశవ్యాప్తంగా పలు రంగాల్లోని ముఖ్యులకు మందిర ట్రస్టు ఆహ్వానాలు అందించడంతో వారంతా వచ్చారు. లక్షలాది మంది భక్తులు ఈ కార్యక్రమానికి వచ్చారు.
Read Also: Mumbai: శ్రీరాముడి ర్యాలీలో ఇరు వర్గాల మధ్య ఘర్షణ.. ఘటనపై ఫడ్నవీస్ సీరియస్..
ఇదిలా ఉంటే రామ మందిర ముహూర్తం వేళలో తమ పిల్లలకు జన్మనివ్వాలని తల్లులు ఆరాటపడ్డారు. దీనికి అనుగుణంగానే ఈ రోజు డెలివరీ అయ్యేందుకు ప్రాధాన్యత ఇచ్చారు. ఇదిలా ఉంటే తాజాగా ఓ ముస్లిం మహిళ రాముడిపై తనకున్న భక్తిని చాటుకుంది. సోమవారం ఫర్జానా అనే ముస్లిం మహిళ మగబిడ్డకు జన్మనిచ్చింది. బిడ్డకు రాముడి పేరు వచ్చేలా ‘రామ్ రహీమ్’ని పేరుపెట్టినట్లు కుటుంబ సభ్యులు చెప్పారు. ఈ ఘటన ఉత్తర్ ప్రదేశ్ ఫిరోజ్‌పూర్‌లో చోటు చేసుకుంది. ఇది హిందూ-ముస్లింల ఐక్యతను తెలియజేస్తుందని పేర్కొన్నారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నట్లు జిల్లా మహిళా ఆస్పత్రి ఇంఛార్జ్ డాక్టర్ నవీన్ జైన్ తెలిపారు.
పిల్లవాడి అమ్మమ్మ హుస్నా బాను బాబుకు రామ్ రహీమ్ అని పేరు పెట్టిందని డాక్టర్ వెల్లడించారు. హిందూ-ముస్లింల ఐక్యత సందేశం ఇచ్చేందుకే చిన్నారికి రామ్ రహీమ్ అని పేరు పెట్టినట్లు బాను తెలిపారు.