Mahalaxmi Express: రైలులో ఓ ముస్లిం యువతి పండంటి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తన బిడ్డకు జన్మకు వేదికగా మారిన రైలు పేరునే ఆమె తన బిడ్డకు పెట్టుకోవడం మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. రైలు పేరు మీద ఓ ముస్లిం జంట తమ బిడ్డకు హిందూ దేవత పేరును పెట్టడం చర్చనీయాంశంగా మారింది. 31 ఏళ్ల ఫాతిమా ఖాతున్ జూన్ 6న కోల్హాపూర్- ముంబై మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్‌లో ప్రయాణిస్తున్న సమయంలో పురిటినొప్పులు వచ్చాయి. రైలులోనే బిడ్డకు జన్మనిచ్చింది.
Read Also: Ponnam Prabhakar: రెవెన్యూ పెంచేందుకు మార్గాలు అన్వేషించాలి.. అధికారులకు సూచన
రైలు లోనావాలా స్టేషన్ దాటిన తర్వాత ఆడిపిల్లకు జన్మనిచ్చింది. ఆమె భర్త తయ్యబ్ రైలు పేరు ‘‘మహాలక్ష్మీ’’ని తన బిడ్డకు పెట్టారు. ఫాతిమా మీరా రోడ్‌కి చెందిన వారు. నివేదిక ప్రకాంర.. మహాలక్ష్మీ ఎక్స్‌ప్రెస్ లోనావాలో చేరుకున్న సమయంలో ఇంజిన్‌లో సాంకేతిక సమస్య కారణంగా రెండు గంటలు అక్కడే నిలిచిపోయింది. రైలు కదిలిన తర్వాత ఫాతిమాకు నొప్పులు ప్రారంభయ్యాయి. ఈ సమయంలో ఫాతిమా వాష్‌రూమ్‌కి వెళ్లింది. ఎంతకీ తిరిగి రాకపోవడంతో వెళ్లి చూడగా ఆమె ఆడబిడ్డకు జన్మనిచ్చి కనిపించింది. నిజానికి ఫాతిమా డెలివరీ గడువు తేదీ జూన్ 20గా ఉంది.
ఇంజిన్ వైఫల్యంతో లోనావాలో రైలు రెండు గంటలు నిలిచిపోయిందని, ఆ తర్వాత తన భార్య కడుపు నొప్పిగా ఉందని చెప్పిందని, వాష్‌రూమ్ వెళ్లి చూడగా బిడ్డను ప్రసవించినట్లు తెలిసిందని తయ్యబ్ మీడియాతో చెప్పారు. రైలు కర్జాత్ స్టేషన్ చేరుకోగానే, కుటుంబం రైలు దిగింది. అప్పటికే రైల్వే స్టేషన్ చేరుకున్న నర్సు, వైద్య సిబ్బంది తల్లిబిడ్డలను తదుపరి చికిత్స కోసం ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం తల్లిబిడ్డా క్షేమంగా ఉన్నారని అధికారులు తెలిపారు. కొల్హాపూర్‌లోని మహాలక్ష్మీ ఆలయానికి వెళ్లిన కొంతమంది సహప్రయాణికులు కుమార్తె పుట్టడం దేవతగా అభివర్ణించారు. అందుకే తమ బిడ్డకు ‘‘మహాలక్ష్మీ’’ పేరు పెట్టాలని నిర్ణయించుకున్నట్లు ఆ జంట చెప్పింది.