Site icon NTV Telugu

Karnataka: ముస్లిం కోటా బిల్లుకు ఆమోదం.. పేపర్లు చింపి స్పీకర్ ముఖం మీద కొట్టిన బీజేపీ ఎమ్మెల్యేలు

Muslimquotabillpassedkarnat

Muslimquotabillpassedkarnat

కర్ణాటక అసెంబ్లీ రణరంగంగా మారింది. ముస్లిం కోటా బిల్లుపై అధికార-ప్రతిపక్ష సభ్యలు మధ్య తీవ్ర వాగ్వాదం చోటుచేసుకుంది. తీవ్ర ఉద్రిక్తతలు చోటుచేసుకున్నాయి. మొత్తానికి ఆందోళనల మధ్యే ప్రభుత్వ కాంట్రాక్టుల్లో ముస్లింలకు 4 శాతం రిజర్వేషన్లు కల్పించే బిల్లుకు ఆమోదం తెలిపింది. ఈ సందర్భంగా బీజేపీ ఎమ్మెల్యేలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. బిల్లు కాపీలను చింపి.. స్పీకర్‌పై విసిరారు. ఈ బిల్లును కాంగ్రెస్ సమర్థించగా.. బీజేపీ దీన్ని తీవ్రంగా వ్యతిరేకించింది. ఇది రాజ్యాంగ విరుద్ధమని ఆరోపించింది. చట్టబద్ధంగా ఎదుర్కొంటామని బీజేపీ హెచ్చరించింది.

ఇది కూడా చదవండి: Naga Vamsi : పవన్‌తో మూవీ చేయాలనుకోవడం తప్పు..

సమాజిక న్యాయం కోసమే ప్రభుత్వ కాంట్రాక్టులలో 4 శాతం ముస్లిం కోటాను ఆమోదించినట్లు కాంగ్రెస్ పేర్కొంది. ఓ వైపు హనీ ట్రాప్ కుంభకోణంపై రచ్చ సాగుతున్న వేళ అనూహ్యంగా ముస్లిం కోటా బిల్లును అసెంబ్లీలో కాంగ్రెస్ ఆమోదించింది. ఇక సభలో బీజేపీ ఎమ్మెల్యేలు పెద్ద ఎత్తున ముఖ్యమంత్రి సిద్ధరామయ్యకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. స్పీకర్ పోడియం దగ్గర నిరసన వ్యక్తం చేశారు. కాగితాలు చించేసి స్పీకర్‌పై విసిరారు.

ఇది కూడా చదవండి: Mumbai: ఒకే బెంచ్‌పై కూర్చుని వడ పావ్ ఆస్వాదించిన బిల్‌గేట్స్-సచిన్

బీజేపీ ఎమ్మెల్యే భరత్ శెట్టి మాట్లాడుతూ.. ‘‘హనీ ట్రాప్ కుంభకోణం గురించి చర్చించే బదులు.. ముఖ్యమంత్రి నాలుగు శాతం ముస్లిం బిల్లును ప్రకటించడంలో బిజీగా ఉన్నారు. అందుకే మేము నిరసన తెలిపాము. ప్రభుత్వ ఎమ్మెల్యేలు కూడా కాగితాలను చించి, పుస్తకాలు విసిరారు. మేము ఎవరికీ హాని చేయలేదు.’’ అని తెలిపారు.

ఇది కూడా చదవండి: IPL 2025: ఐపీఎల్‌ ‘డాడీ’.. 1000 సిక్స్‌లు, 300+ స్కోర్స్ పక్కా!

Exit mobile version